బాబుకి `పైత్యకారి’ హోదా !

ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రానికి `స్పెషల్ స్టేటస్’ తీసుకురాలేకపోతున్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం (వైస్సార్సీపి) నుంచి `పైత్యకారి’ అన్న `ప్రత్యేక’ హోదాని మాత్రం ఇప్పటికే సంపాదించుకున్నారు. వైఎస్సార్సీపికి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సీఎం- బాబుకు `పైత్యకారి’ హోదా కట్టబెట్టారు. చంద్రబాబు నిర్ణయాలన్నీ పైత్యపు చేష్టలేనని ఆ ఎమ్మెల్యే తేల్చిపారేశారు. దీంతో తెలుగుదేశం శిబిరాలు ఉడుక్కుంటున్నప్పటికీ ఎదురుదాడి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. పైపెచ్చు, తమ అగ్రనేతను ఎదిరించే ధైర్యంలేక నోటికి తాళం బిగించి జరిగే తంతు చూస్తున్నారు. నూతన రాజధాని కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బాబుపై ఇంతటి నిందారోపణలు ఎందుకు చేయాల్సి వస్తున్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాష్ట్రానికి బాబు ఎలాగూ స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోతున్నారు. దీనికి తోడు నూతన రాజధానికోసం సరికొత్త పద్ధతుల్లో విరాళాలు వసూలుచేస్తూ అదేదో గొప్ప ఘనకార్యమైనట్లు ఫీలవడమే ఇప్పుడు ఇలాంటి విమర్శలకు కారణమైంది. దేశంలోనే అత్యంత ఘనమైన రాజధాని నిర్మించాలని బాబు కంటున్న కలలు, ఆయనగారి మాటలు, చేష్టలు ఎదుటివారికి, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులకు `వేరేలా’ స్ఫూరించడం తాజా ట్విస్ట్.

నూతన రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలన్నది బాబు ఉద్దేశం. అందుకే `మన ఇటుక – మన అమరావతి’ పేరిట పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ (amaravati.gov.in/EBricks/Index.aspx) అవకాశం కల్పించారు. హైటెక్ సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో సహజంగానే దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారు విశేషంగా స్పందించారు. 2015 నవంబర్ 10 నాటికే ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డుల్లో చోటుదక్కిందని చెబుతున్నారు. అప్పటికి లక్షా5వేల 803 మంది అమరావతి కోసం ఇటుకలు కొనుగోలు చేశారు. కాగా, ఇటుకులు కొనుగోలుచేసినవారి సంఖ్య జనవరి 6వ తేదీ రాత్రి 9-30 ప్రాంతానికి రెండు లక్షల 22వేల 886కి చేరింది. 53లక్షల 3వేల 184 ఇటుకలు కలెక్ట్ అయ్యాయి. ఒక్కో బ్రిక్ ఖరీదు పది రూపాయులుగా నిర్దేశించారు. అమరావతికి విరాళాల కార్యక్రమం ఇలా ఒకవైపు జోరుజోరుగా సాగుతుంటే, మరోవైపు ఇంకో కార్యక్రమానికి బాబు ఈమధ్యనే శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ బాధ్యతను డిఈఓలకు అప్పగిస్తూ నూతన సంవత్సరం ఆరంభంలోనే ఒక జివో కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా అమరావతి కోసం 10 రూపాయల చొప్పున చెల్లించాలి. విద్యార్థులేకాదు, ఉపాధ్యాయులు కూడా ఇలాగే చెల్లించాల్సి ఉంటుంది. స్కూల్స్ లోనే కాకుండా కాలేజీల్లో కూడా విద్యార్థుల నుంచి అమరావతి కోసం విరాళాలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో 50లక్షల మందిదాకా విద్యార్థులు ఉంటారని ఒక అంచనా. అయితే ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీల్లో చదివేవారిలో చాలామంది పేదవిద్యార్థులే కావడం గమనార్హం. ప్రభుత్వం ఇస్తున్న ఉపకారవేతనమే వారికి ఆధారం. అలాంటి వారి వద్ద నుంచి పది రూపాయలు కాదు, ఒక్క రూపాయి అడిగినా అది తప్పే అవుతుందన్న భావన బలంగావినబడుతోంది. విద్యార్థుల నుంచి ఇలా వసూళ్లు చేస్తూ అదేదో ఘనకార్యమైనట్లు చంద్రబాబు ఫోజులిస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణ మొన్నీమధ్యనే గుంటూరులో కామెంట్ చేశారు. ఇవన్నీ బాబు పైత్యపు చేష్టలంటూ మండిపడ్డారు.

నూతన రాజధాని నిర్మాణంలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలనుకోవడం ఓ మంచి ఆలోచనే. అయితే, అందుకు తగ్గట్టుగానే జవాబుదారీతనం ఉండాలి. రేపు ఎవరైనా తాను ఇచ్చిన విరాళాన్ని ఎలా సద్వినియోగం చేశారో తెలపండంటూ ఏ సమాచారహక్కు చట్టాన్నో ఉపయోగించి అడిగితే అధికారగణం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వగలదా ? లేక నోరువెళ్లబెడుతుందా ? అన్న అంశంపై ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు క్లారిటీ ఉండాలి. భాగస్వాములుగా మార్చడం తేలికే కావచ్చు, కానీ రేపు ఏదైనా తేడావస్తే నిలదీసి అడిగే హక్కు వారికి ఉంటుందన్న విషయాన్ని బాబు మరచిపోకూడదు.

రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉంది. అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు (అమరావతి నిర్మాణం వంటివి) తీసుకునేటప్పుడు ప్రతిపక్షసభ్యులను కలుపుకుపోవడానికి బాబు రెడీగా లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. కేవలం గిన్నీస్ బుక్ లో రికార్డులు సృష్టించాలన్న తపనో, లేదా రాజధాని నిర్మాణంలో క్రెడిట్ అంతా తానొక్కడే కొట్టేయాలన్న యావో బాబులో బాగా పేరుకుపోయిందన్న విమర్శలకు బాబు సమాధానం చెప్పాల్సిందే. మరి దీనికి బాబు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close