చెమటలు పట్టించిన చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు చెమటలు పట్టించారు. సరిగ్గా తొమ్మిదిరోజుల క్రితం రాజమండ్రి ఆర్‌ అండ్‌ బి అతిధిగృహంలో ఇక చర్చలుండవని… చర్యలే ఉంటాయని అధికారులను హెచ్చరించిన చంద్రబాబు, ఆ మాటకు కట్టుబడి ఈరోజు అదే పద్ధతిని అనుసరించారు.

శనివారం మధ్యాహ్నం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు ముందుగా ఎయిర్‌పోర్టు రోడ్‌లో జరుగుతున్న పుష్కర పనులను పరిశీలించారు. పనుల తీరు, నాణ్యతాలోపం కనిపించడంతో పుష్కరాల ప్రత్యేకాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి అడుగడుగునా పనులు పరిశీలించారు. అధికారులు ముందుగా సిద్ధపర్చిన రూట్‌ మ్యాప్‌ను చంద్రబాబు ఆకస్మికంగా మార్చి పలు ప్రాంతాల్లో పర్యటించి నిర్వహణా లోపాలపై ధ్వజమెత్తారు. మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా సెంట్రల్‌ జైలు వద్ద రూ.86లక్షలతో నిర్మిస్తున్న పార్కును పరిశీలించిన చంద్రబాబు పనులు జాప్యంగా జరగడంపై కమిషనర్‌ మురళిని ప్రశ్నించారు. తాను చెప్పినప్పటికీ పనితీరులో మార్పు రాలేదని, రేపటికల్లా పార్కు పనులు పూర్తి కావాలని హెచ్చరించారు. ఆ తరువాత వై-జంక్షన్‌, కంబాలచెరువు, దేవీచౌక్‌ మీదుగా పయనిస్తున్న కాన్వాయ్‌ని పశువుల ఆసుపత్రి వద్ద చంద్రబాబు ఆపు చేయించారు. అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ పనులు అస్తవ్యస్తంగా ఉండటంపై కమిషనర్‌ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డివిజన్‌కు సంబంధించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, మేస్త్రిని సస్పెండ్‌ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాలు సమీపిస్తున్నా ఇంత నిర్లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపడతారా అంటూ మండిపడ్డారు.

అనంతరం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా వెళ్తున్న కాన్వాయ్‌ని ఆపి అక్కడ భారీకేడ్లు కోసం వేసిన గోతులను పరిశీలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్‌ ఐలాండ్‌ తుప్పుపట్టి ఉండటంతో అర్బన్‌జిల్లా ఎస్పీ హరికృష్ణను పిలిచి ఇదేమిటని ప్రశ్నించారు. పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్‌ ఐలాండ్‌లను అందంగా ఎందుకు మలచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్యాపురం గాంధీబొమ్మ వద్ద వున్న మేజర్‌ డ్రైన్‌ని చూసిన చంద్రబాబు బస్సు దిగారు. డ్రైన్‌లో సిల్టు పేరుకుపోవడంపై కమిషనర్‌ని పిలిచి ప్రశ్నించారు. ‘ఏం చేస్తున్నారు… డ్రైన్లలో పూడిక తీయలేదా…ఏం చేస్తున్నారు, ఎంత చెప్పాలి… నాన్సెస్‌…పనిచేయించడం చేతకాదా’ అంటూ చంద్రబాబు ఆగ్రహించారు. యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేయాలని ఆదేశించారు. అనంతరం కోటిలింగాలపేటలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కొద్దిసేపు బస్సులోనే విశ్రాంతి తీసుకున్నారు.అనంతరం అక్కడే నిర్మిస్తున్న పుష్కర్‌నగర్‌ను పరిశీలించారు. ఆ తరువాత కోటిలింగాల ఘాట్‌కు చేరుకుని పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close