దేశవ్యాప్తంగా చట్టాన్ని ఫర్ ఫెక్ట్ గా ఫాలో అయ్యే అరుదైన నేతల్లో ఏపీ సీఎం చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. ఏది చేసినా చట్టబద్దంగానే ముందుకు వెళ్తారు. అదే ఆయన్ను మిస్టర్ ఫర్ ఫెక్ట్ లీడర్ గా నిలబెట్టింది. ఎందుకు ఆయన్ను అలా పిలుస్తారో మరోసారి తన నిర్ణయంతో తెలియజేశారు చంద్రబాబు.
వైసీపీ హయాంలో ఆ పార్టీ పెద్దల ప్రాపకం కోసం పని చేసి, ప్రస్తుతం ఏ పోస్టింగు లేకుండా ఖాళీగా ఉన్న ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామి రెడ్డికి అదనపు వేతనం చెల్లించింది కూటమి సర్కార్. చట్టబద్దంగా ఆయనకు చెల్లించాల్సిన మొత్తమే అది. కానీ, తన విషయంలో రఘురామిరెడ్డి వ్యవహరించిన తీరుతో అదనపు వేతనం చెల్లింపుకు చంద్రబాబు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ మరో సీఎం అయితే హోల్డ్ లో పెట్టేసేవారే. కారణం నాటి ప్రభుత్వ పెద్దల సూచన మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నంద్యాలలో అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేసింది ఈ రఘురామిరెడ్డే.
ఇక, కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. జగన్ కళ్ళలో సంతోషం చూసేందుకు నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆయనకు చట్టబద్దంగా రావాల్సిన వాటిని ఎలా ఇస్తారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, చట్టాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవద్దనే కోణంలో ఆయనకు అదనపు వేతనం ఆపవద్దని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అయితే, రఘురామి రెడ్డికి అదనపు వేతనం ఇవ్వడానికి కారణం లేకపోలేదు..వైసీపీ హయాంలో తమవాడు అని ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు జగన్.రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని వేసిన నియమించిన సిట్ విభాగానికి అధిపతిని చేశారు. అలాగే, ఏసీబీ , సీఐడీ కేసులను కూడా ఆయనకే అప్పగించడంతో.. గతంలో చేసిన పనికి అదనపు వేతనం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు రఘురామిరెడ్డి.జగన్ హయాంలోనే ఈ దరఖాస్తు చేసుకున్నా అప్పట్లో ఎన్నికలు ఉండటం వలన అది పరిశీలనలోనే ఉండిపోయింది. కూటమి సర్కార్ ఏర్పాటు అయిన ఏడాది తర్వాత ‘ఫుల్ అడిషనల్ చార్జి కింద ఆయనకు ఇవ్వాల్సిన వేతనాన్ని ఇచ్చేశారు.
అయితే, తనను అరెస్ట్ చేసిన రఘురామిరెడ్డికి చట్టబద్దంగా రావాల్సిన వేతనాన్ని చంద్రబాబు కనుక ఇచ్చారు కానీ, మరో నేత అయ్యుంటే చెల్లించేవారు కాదేమో.