చంద్రబాబు, లోకేష్‌లపై లాక్‌డౌన్ కేసులు..!

చంద్రబాబునాయుడు, లోకేష్ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. ఓ లాయర్ చేసిన ఫిర్యాదు మేరకు.. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం చంద్రబాబునాయుడు.. వర్చువల్ మహానాడు నిర్వహణ కోసం..హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు. ఆ సమయంలో.. ఆయనకు పలు చోట్ల కార్యకర్తలు స్వాగతం పలికారు. నేతలే ఇలా జన సమీకరణ చేసి స్వాగతం చెప్పారని… దానికి చంద్రబాబు, లోకేష్ ప్రోత్సాహం ఇచ్చారని… వారు కనిపించినప్పుడల్లా.. కాన్వాయ్ ఆపి చేతులు ఊపి… కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలను వైసీపీ నేతలు చేశారు.

కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు పిటిషన్ దార్లకు సూచించింది. ఆ తర్వాత బి.శ్రీనివాసరావు అనే లాయర్ నందిగామ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. ఇప్పటికే అనేక మంది విపక్ష నేతలపై కేసులు పెట్టారు. పేదలకు సాయం పంపిణీ చేసే సమయంలో… భౌతిక దూరం.. మాస్కుల నిబంధనలు పాటించలేదని కేసులు పెట్టారు.

అయితే.. అంత కంటే దారుణంగా.. ర్యాలీలు.. నిర్వహించి.. పుట్టిన రోజు.. పెళ్లి రోజు వేడుకలను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. వైసీపీ నేతలు చేసుకున్నప్పటికీ… పోలీసులు వారి జోలికి వెళ్లలేదు . చివరికి ఎమ్మెల్యేలపై కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వారు చేసిన సామూహిక లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన వీడియోను హైకోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా… లాక్ డౌన్ నిబంధనల కేసుల్లో చిక్కుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో 'న‌మ్మిన బంటు' సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే...

HOT NEWS

[X] Close
[X] Close