తెలుగుదేశం పార్టీకి ఉండే ప్రజాబలం ఓట్లుగా మారి ప్రజాప్రతినిధులుగా కళ్ల ముందు ఉంటే.. ఆ బలంతో చంద్రబాబు రాష్ట్రం కోసం ఏం చేయగలరో అది చేయడానికి వంద శాతం కృషి చేస్తారు. ప్రజాప్రతినిధుల బలం పూర్తిగా రాష్ట్రం కోసమే కేటాయిస్తారు కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసలు ఉపయోగించరు. ఈ విషయం చంద్రబాబు డీల్ చేసే బ్యూరోక్రాట్లు, రాజకీయ నేతలకు క్లారిటీ ఉంటుంది. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఈ విషయాన్ని చెప్పుకోవడంలో విఫలమవుతూ వస్తున్నారు. అందుకే ఆయనకు రాజకీయ ఒడిదుడుకులు.
వాజ్ పేయి హయాంలో 40 శాతం నిధులు ఆంధ్రకు !
చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలవడం ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన ఉపయోగం తెచ్చి పెట్టింది. అదో స్వర్ణయుగం. కేంద్ర నిధుల్లో పెద్ద ఎత్తున ఏపీకి వచ్చాయి. కేంద్ర పథకాల్లో అత్యధికం ఏపీకి వచ్చాయి. ఆ విషయం.. అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నాధికారి గార్గ్ తన ఆత్మకథలో చెప్పారు. ఎంతగా తీసుకెళ్లారంటే.. ఏపీ కోసం తమ రక్తం తాగేసేవారని ఆయన చెప్పుకున్నారు. ఆయన ఏ టోన్‌లో చెప్పినా.. చంద్రబాబు ఏపీ సీఎం.. ఏపీకి ఎంత అవకాశం ఉంటే అంత మేలు చేయడమే ఆయన టార్గెట్. చేసి చూపించారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు . కేంద్రం దగ్గర నిధులు తెచ్చి చేసిన సంపద సృష్టి.. తర్వాత గెలిచిన వారి దోపిడీ నాయకులకు గొప్ప అవకాశం అయింది.
ఇప్పుడైనా అదే పాలసీ !
చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం రావాలి కానీ ఆయన ఎప్పుడూ.. వ్యక్తిగత స్వార్థం, రాజకీయ ప్రయోజనాల కోసం చూడలేదు. ఇప్పుడు కూడా బీజేపీకి అడిగిన పదవులు ఇస్తున్నారు. వారు ఇస్తేనే ఇతర పదవుల్ని తీసుకుంటున్నారు. కానీ కేంద్ర నిధుల కోసం మాత్రం వెంట పడుతున్నారు. అందుకే కేంద్రం.. ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల్ని ప్రటిస్తూనే ఉంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనూ ఓ పరిశ్రమను కేంద్రం ప్రకటించింది. ప్రజలు ఇచ్చిన బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా వాడారో చంద్రబాబుకు వంద శాతం తెలుసు.
వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజాబలాన్ని వాడిన జగన్ రెడ్డి
జగన్ రెడ్డికి ప్రజలు ఓసారి తిరుగులేని అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని ఆయన పూర్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకున్నారు. నిమ్మగడ్డను సెర్బియాలో అరెస్టు చేస్తే ఎంపీలందర్నీ ప్రత్యేక విమానంలో విదేశాంగ మంత్రి వద్దకు పంపారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వస్తే ఆపడానికి అధికారాన్ని వాడారు. తన కేసులు డీలే చేయడానికి.. న్యాయవ్యవస్థపై దాడిచేయడానికి వాడారు. కానీ రాష్ట్రం కోసం ఆ ప్రజాబలాన్ని ఒక్క సందర్భంలో వాడారని చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అత్యంత స్వార్థ పూరిత , వ్యక్తిగత రాజకీయాలు చేసే జగన్ రెడ్డికి వేసే ఒక్క ఓటు అయినా అది ఆయన స్వార్థానికే ఉపయోగించుకుంటారు కానీ.. ఏపీ కోసం కాదు. అన్నీ తెలిసినా చంద్రబాబుపై వ్యతిరేకత.. జగన్ వస్తే ఏదో దోచి పెడతారన్న ఆశతో కొంత మంది సపోర్టు చేస్తూ ఉంటారు.
