ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్ లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. మొత్తం 8 మంది సభ్యులు వెళ్తున్నారు. ల బృందంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ తో పాటు ఐదుగురు సీనియర్ అధికారులు ఉంటారు. అక్కడ పెట్టుబడిదారులతో విస్తృతంగా చర్చలు జరుపుతారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా అమరావతి ఒప్పందం పునరుద్ధరణకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. అమరావతి మాస్టర్ ప్లాన్ ఇచ్చింది సింగపూరే. సీడ్ క్యాపిటల్ ను సింగపూర్ ప్రభుత్వ సంస్థ సాయంతో అభివృద్ధి చేయాలనుకున్నారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొత్తం నాశనం చేశారు. ఎలాంటి అవకతవకలు లేకపోయినా ఒప్పందాన్ని రద్దు చేశారు. దాంతో సింగపూర్ ఇలాంటి నాన్ సీరియస్ ప్రాజెక్టుల్ని పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది.
ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత .. మరోసారి సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. కానీ ఇప్పుడు ఇలా ఉంటే.. మళ్లీ ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారితే మళ్లీ రద్దు చేస్తారని.. ఇలాంటి ఒప్పందాలతో టైం వేస్ట్ చేసుకోలేమని తేల్చేశారు. మంత్రి నారాయణ ఒకటి రెండు సార్లు సింగపూర్ బృందంతో సంప్రదింపులు జరిపినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దాంతో చంద్రబాబు నేరుగా సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
భూతం మళ్లీ రాదని వారిని నమ్మిస్తేనే సింగపూర్ అమరావతి విషయంలో తమ పాత ఒప్పందాలను పునరుద్ధరించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది. చంద్రబాబు ఈ విషయంలో ఎంత సక్సెస్ అవుతారన్నదానిపైనే ఆ పర్యటన సక్సెస్ ఆధారపడి ఉంది. సింగపూర్ సంస్థలు లేదా వ్యక్తులతో అవినీతి చేయడం దాదాపుగా అసాధ్యం. చిన్న చిన్న బహుమతులు తీసుకుంటనే అక్కడ ..హోదాలతో సంబంధం లేకుండా శిక్షలు వస్తారు. అలాంటి వారిపైనే ఆధారాలు లేకుండా అభాండాలు వేస్తే .. . ఎలా వస్తారు ?