కుప్పంలో రిపేర్లకు చంద్రబాబు పయనం..!

పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలు గెలిచి చంద్రబాబు పట్టు జారిపోయిందని నిరూపించాలనుకున్న వైసీపీ అనుకున్న ఫలితాన్ని సాధించింది. కుప్పంపై గురి పెట్టారని తెలుసుకున్నా… స్థానిక నేతలపై ఎక్కువ నమ్మకం ఉంచిన చంద్రబాబు… ఈసీకి లేఖలు రాయడం తప్ప ఏమీ చేయలేదు. దాంతో ఫలితాలు తేడా వచ్చేశాయి. ఇప్పుడు పరిస్థితిని చక్క దిద్దుకోకపోతే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారేమో వెంటనే.. చలో కుప్పం టూర్ పెట్టుకున్నారు. ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకూ మూడు రోజుల పాటు కుప్పంలోనే మకాం వేసి.. పార్టీ పరిస్థితిని మెరుగుపర్చడానికి పార్టీ నేతలతో కలిసి మంతనాలు నిర్వహించనున్నారు.

కుప్పంలో చంద్రబాబుకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన మెజార్టీ ఎప్పుడైనా యాభై వేల దరి దాపుల్లో ఉంటుంది. అక్కడ టీడీపీ అభ్యర్థులకు వచ్చే మెజార్టీతోనే చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి గెలుస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో చంద్రబాబు తొలి రెండు రౌండ్లలో వెనుకబడ్డారు.చివరికి ముఫ్పై వేల చిల్లర ఓట్లతో గెలిచినప్పటిప్పటికీ…మెజార్టీ తగ్గిన ప్రభావం చిత్తూరు పార్లమెంట్ సీటుపై పడింది. ఆ సీటును కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి మరింత దిగజారింది. కుప్పంలో పంచాయతీల్ని కోల్పోవడానికి కారణం అప్రజాస్వామిక విధానాలని.. పెద్దిరెడ్డి రూ. అరవై కోట్లు ఖర్చు పెట్టాడని.. రౌడీయిజం చేశారని రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు.

కానీ అవన్నీ చేస్తారని టీడీపీ నేతలకు తెలుసు. తెలిసి కూడా ఏమీ చేయలేకపోయారంటే అది అసమర్థతే అవుతుంది. ముఖ్యమంత్రిగా ఉండగా తాను కుప్పం ప్రజల అభ్యున్నతి చేసిన సేవలు.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి కుటుంబానికి అందిన సాయం తమపై ప్రజల విశ్వాసాన్ని చెరపలేవని టీడీపీ నేతలకు ధీమాకు పోయారు. కానీ రాజకీయం మారిందని తాజా ఫలితాలతో వెల్లడైంది.చంద్రబాబు ఇప్పుడు… పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి వెళ్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close