కోడెల‌ను అలా అర్థం చేసుకోవాల‌న్న‌మాట‌..!

ఒక గ్లాసులో స‌గం నీళ్లున్నాయే అనుకోండి! ఆ గ్లాసు స‌గం ఖాళీగా ఉంద‌నీ చెప్పొచ్చు, స‌గ‌మే నిండి ఉంద‌నీ చెప్పొచ్చు! అయితే, ఆ గ్లాసులో నిండుగా నీళ్లు లేవ‌న్న‌ది వాస్త‌వం. ఇలా ఒక విష‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో కోణం నుంచి చూస్తూ అర్థం చేసుకుంటారు. ఎవ‌రికి ఏది ఎలా అర్థ‌మైనా వాస్త‌వం అనేది ఒక‌టి ఉంటుంది. స‌రే, ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు చేసిన వ్యాఖ్య‌ల్నే తీసుకుందాం! మ‌హిళా సాధికార‌త గురించి ఆయ‌న మాట్లాడుతూ… వారు వంటింటికే ప‌రిమిత‌మైతే ఏ గొడ‌వా ఉండ‌ద‌నీ, దాడులు ఉండ‌వ‌ని అన్నారు. షెడ్డులోనే కారు ఉండాల‌నీ, రోడ్డు మీదికి వ‌స్తేనే ఇబ్బందుల‌నీ కూడా ఉప‌మానం చెప్పారు. అయితే, ఈ విష‌యంపై జాతీయ మీడియా కూడా స్పందించేసింది! ఏపీ స్పీక‌ర్ వ్యాఖ్య‌ల్ని త‌ప్పుబ‌డుతూ క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. స‌రే.. ఆంధ్రాలో ఎవ‌రి మీడియా వారికి ఉంది కాబ‌ట్టి, కోడెల‌పై ఎంత దుమారం రేగుతున్నా చంద్ర‌బాబు స్పందించ‌లేదు! కానీ, జాతీయ మీడియాకు ఏపీలో పొలిటిక‌ల్ ఇంట్రెస్ట్ ఏముంటుందీ..? అక్క‌డ కూడా కోడెల వ్యాఖ్య‌ల‌పై నెగెటివ్ స్టోరీలు వ‌స్తుండేస‌రికి చంద్ర‌బాబు స్పందించాల్సి వ‌చ్చింది!

‘ఆయ‌న మాట‌ల్లో త‌ప్పేముంది’ అంటూ కోడెల‌ను వెన‌కేసుకొచ్చారు చంద్ర‌బాబు! భావ వ్య‌క్తీక‌ర‌ణ మాత్ర‌మే కాస్త తేడాగా ఉంద‌నీ, ఆ మాత్రానికే స్పీక‌ర్‌పై ఇలాంటి క‌థ‌నాలు రాస్తారా అనీ, స్పీక‌ర్ స్థానం ప‌రువు తీసేస్తారా అనీ, మ‌హిళ గురించి ఆయ‌న సానుకూల దృక్ప‌థంతో ఏదో మాట్లాడితే దాన్ని వ‌క్రీక‌రిస్తారా అనీ, శాస‌న స‌భ స్పీక‌ర్ స్థానానికి గౌర‌వం ఇవ్వ‌రా… అంటూ క్లాసు తీసేసుకున్నారు. హ‌ద్దులు దాటితే ఎవ్వ‌రినీ ఉపేక్షించేది లేదంటూ ఓ హెచ్చ‌రిక కూడా చేశారు! జాతీయ మీడియా కూడా ఇష్టానుసారం రాయ‌మేంటీ అంటూ మండిప‌డ్డారు.

మ‌రి, కోడెల వ్యాఖ్య‌ల్లోని ఆంత‌ర్య‌మేంటో చంద్ర‌బాబు చెబుతున్నా కూడా కొంత‌మంది అర్థం కావ‌డం లేదు! కోడెల వ్యాఖ్య‌ల్ని పాజిటివ్ క‌ళ్ల‌జోడులోంచి ఎలా చూడాల‌బ్బా అనేది ప్ర‌శ్న‌గా మారింది. కారును షెడ్డులోనే ఉంచాల‌న్న ఉప‌మానాన్ని పాజిటివ్‌గా ఎలా అర్థం చేసుకోవాలీ అనేదే ప్ర‌శ్న? ఒక‌లా అర్థం చేసుకోవ‌చ్చండోయ్‌.. షెడ్డు అనేది ఒక మ్యూజియం అనుకుంటే, అందులో కారును ఉంచొచ్చు! మ్యూజియంలో ఉన్న కారును అత్యంత విలువైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. పాపం… కోడెల ఆంత‌ర్యం ఇదే అయి ఉంటుంది లెండీ! అన‌వ‌స‌రంగా ఆయ‌న్ని ఆడిపోసేసుకుంటున్నారు, క‌దా!

మొన్న‌నే…. కోడెల కోడ‌లు కూడా ఇదే విష‌యం చెప్పారు క‌దా! త‌న‌ను హింసలు పెడుతున్నార‌నీ, పిల్లాడిని బ‌ల‌వంతంగా త‌న‌ను నుంచీ లాక్కెళ్లిపోయార‌నీ ఆమె మీడియా ముందు క‌న్నీరు మున్నీరైంది. దీన్నీ నెగెటివ్‌గా ఎందుకు చూడ్డం..! దీన్లో కూడా ఏదో పాజిటివ్ యాంగిల్ ఉందేమో ఎవ‌రికి తెలుసు..! ఉండే ఉంటుంది లెండి. అస‌లే బీకామ్‌లో ఫిజిక్సే ఉంటున్న రోజులివి, ఏమంటారు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close