లాక్‌డౌన్ పెట్టాల్సిందేనంటున్న చంద్రబాబు..!

పరీక్షలు రద్దు చేయాలని నిన్నటిదాకా లోకేష్ ఆన్ లైన్ ఉద్యమం నడిపితే.. ఇప్పుడు లాక్ డౌన్ పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు వాయిస్ పెంచారు. గత రెండు ప్రెస్‌మీట్లలోనూ చంద్రబాబు ప్రధాన డిమాండ్ లాక్ డౌన్‌ పెట్టాలనే. ఏపీ సర్కార్ ప్రజల్ని కరోనాకు వదిలేసి… టీడీపీ నేతల కక్ష సాధింపులు.. ప్రజా ఆస్తులను ఇతరులకు ధారదత్తం చేయడం వంటి వాటి మీద దృష్టి పెట్టిందని ఆరోపిస్తూ.. చంద్రబాబు అత్యవసర పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. కొన్ని తీర్మానాలు చేసి.. ప్రెస్‌మీట్ పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వానికి వినిపించారు. సీసీఎంబీ చెప్పిన కొత్త కరోనా వైరస్ మ్యూటెంట్ ప్రమాదకరంగా మారిందని.. తక్షణం లాక్ డౌన్ పెట్టకపోతే..ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. చంద్రబాబు అంటున్నారు.

అదే సమయంలో వ్యాక్సిన్లను కొనుగోలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అడ్డగోలు ప్రచారానికి వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు కోసం కేవలం రూ. 45 కోట్లు మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. తక్షణం లాక్ డౌన్ పెట్టి… నిరుపేదలకు సాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన కర్ఫ్యూ వల్ల ఉపయోగం లేదని తేల్చేశారు. కర్ఫ్యూ పెట్టి నిత్యవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఉ.6 గంటలకే మద్యం దుకాణాలకు ఎలా అనుమతిస్తారని విమర్శలు గుప్పించారు.

నిజానికి లాక్ డౌన్ పెట్టాలన్న సూచనలు.. సలహాలు.. డిమాండ్లు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. కానీ లాక్ డౌన్ పెడితే… గతంలోలా ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందని.. అదే జరిగితే .. కోలుకోవడం అసాధ్యమని.. ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే వ్యవస్థ కొనసాగేలా.. ఆంక్షలు పెడుతున్నారు. కానీ ఇలాంటి వాటి వల్ల కరోనా కట్టడి కాదని.. లాక్ డౌన్ పెట్టాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పెట్టక తప్పదేమో అన్న పరిస్థితి కూడా వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close