చంద్రబాబునాయుడు .. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ను మళ్లీ భాగస్వామ్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా సింగపూర్ వెళ్లారు. గతంలో సింగపూర్ తో ఆంధ్రా అనుబంధం ఓ స్వర్ణయుగం లాంటిది. అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చారు. తర్వాత జగన్ నిర్వాకంతో ఇక ఏపీ వైపు చూడకూడదనుకున్నారు. కానీ మళ్లీ చంద్రబాబు ఆ భూతం మళ్లీ రాదన్న ధైర్యం ఇచ్చి..అమరావతికి రావాలని ఆహ్వానించేదుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను కలిసేందుకు సింగపూర్ నుంచే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఆరేడు దేశాల నుంచి తెలుగువాళ్లు పారిశ్రామికవేత్తలు వచ్చారు. అందరికీ చంద్రబాబు జన్మభూమి రుణం తీర్చుకోవాలనే సలహానే ఇచ్చారు.
జన్మభూమి కోసం తలో చేయి వేయాలని చంద్రబాబు పిలుపు
అక్కడికి వచ్చిన వారంతా.. చంద్రబాబు ముందు చూపుతో ఐటీ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే తాము ఈ రంగంలో అవకాశాల్ని అంది పుచ్చుకోగలిగామన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే చంద్రబాబు వారు.. మాతృభూమికి ఎంతో కొంత తిరిగివ్వాలని సూచిస్తున్నారు. ఏపీలో పేదల్ని అభివృద్ధి చేసేందుకు పీ4లో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. అలాగే పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వివరిస్తున్నారు. ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టి పలువురికి ఉపాధి కల్పించి.. సంపద సృష్టి చేసి..మరింత ఎదగాలని సూచిస్తున్నారు.
చంద్రబాబును చూసే ఏపీకి పెట్టుబడులు
ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే కాదు..బడా పారిశ్రామికవేత్తలు కూడా ఉంటున్నారు. సింగపూర్ లో చంద్రబాబును కలిసేందుకు పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు తరలి వచ్చారు. ఏపీలో పెట్టుబడులపై తమకు ఉన్న ఆలోచనలు వివరించారు. చంద్రబాబు వారికి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. ఏపీకి వస్తే అన్ని విధాలుగా అనుకూలమైన పారిశ్రామిక వాతావరణం ఉంటుందని.. ఆ ఎకో సిస్టమ్ ను ఎవరూ మార్చలేదని హామీ ఇస్తున్నారు. చంద్రబాబుతో ఐదు నిమిషాలు మాట్లాడితే ఆరు నెలల్లో పెట్టుబడులతో వచ్చామని ఇటీవల యూఏఈ అర్థిక మంత్రి చెప్పారు. బిజినెస్ టాక్స్ లో చంద్రబాబు నైపుణ్యం అలాంటిది. అందుకే ఆయన అంటే పారిశ్రామికవేత్తలు మంచి గౌరవం ఇస్తారు. అవకాశం ఉంటే.. ఏపీలో పెట్టుబడులు పెడతారు.
ఆ ఇన్వెస్టర్లకు కావాల్సింది బ్రాండ్ ఏపీ
అమెరికా వెళ్లినా.. లండన్ వెళ్లినా… సింగపూర్ వెళ్లినా చంద్రబాబు ఇమేజ్ శిఖరంలా ఉంటుంది. ఆయనంటే పారిశ్రామిక వర్గాలు మంచి రెస్పెక్ట్ ఇస్తాయి. నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు చెప్పినట్లుగా ఏపీకి చంద్రబాబు ఓ బ్రాండ్ . కానీ ఆ బ్రాండ్ ను పూర్తి స్థాయిలో ఏపీకి అనుకూలంగా మారాలంటే.. ఇంకా కొన్ని కలసి రావాలి. రాజకీయంగా ఆయన ఇంకా బలవంతుడిగా ఉండాలి. 2014-19 మధ్యలో ప్రభుత్వ పరంగా అద్భుతమైన పనితీరు చూపినా.. భారీ ఓటమితో.. రాజకీయ ఫలితాలు కూడా ఇప్పుడు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారు. ప్రజలపై నమ్మకం ఉంచాలని ఆయన పారిశ్రామికవేత్తల్నీ కోరుతున్నారు. సింగపూర్ నూ కోరుతున్నారు. వారికి కావాల్సింది.. బ్రాండ్ ఏపీకి .. బలమైన బ్రాండ్ చంద్రబాబు బలమైన నాయకత్వమే.