ఏ నాయకుడు జైలుకెళతాడు?

ఏ నాయకుడు జైలుకెళతాడు? అనేది ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. నాయకుడంటే అల్లాటప్పా నాయకుడు కాదండోయ్‌. రాజకీయ దిగ్గజాలన్నమాట. ఒకాయన సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీకి, రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు. మరొకాయన సూపర్‌ డూపర్‌ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా పీఠం మీద ఉన్న నాయకుడు. వాళ్లెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఒకరు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొకాయన వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. జగన్‌ పైన ఉన్న కేసులు, గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రాలో ఆయన జైలు జీవితం గడపడం తెలిసిందే కదా. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ బెయిల్‌ మీదనే ఉన్నాడు.

ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళ్లాడు. ఆయన సుదీర్ఘంగా పాదయాత్ర జరిపినప్పుడు కూడా యాత్రను ఆపేసి కోర్టుకు అటెండయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక సహజంగానే బిజీ అవుతాడు కదా. దాంతో ‘ముఖ్యమంత్రిగా నేను బిజీగా ఉన్నానండీ కోర్టుకు రాలేను’ అని ఈయన చెప్పాడు. కాని ‘నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే మాకేమిటి? కోర్టుకు రావల్సిందే’ అని సీబీఐ కోర్టు ఏమాత్రం కనికరం లేకుండా చెప్పేసింది. దీంతో టీడీపీ నేతలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. పాదయాత్ర చేస్తున్నప్పుడే జగన్‌ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైనప్పుడు టీడీపీ నేతలు జగన్‌ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నానా రకాలుగా ఎద్దేవా చేశారు. ఆయన ఎలాగైనా సరే మరోసారి జైలుకు వెళ్లడం ఖాయమని లోపల అనుకోవడమే కాదు, బయటకే అన్నారు. జగన్‌ వ్యక్తిగతంగా కోర్టుకు రావల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించిన తరువాత రెండు శుక్రవారాలు కోర్టుకు హాజరు కాలేదు. ఇలా డుమ్మా కొడితే కోర్టు ఆయన బెయిల్‌ రద్దు చేస్తుందని, మళ్లీ జైలుకు పంపుతుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. వారిలా ‘జగన్‌ జైలు’ కలలు కంటుండగానే ఓ దుర్వార్త వినిపించింది.

కాశ్మోరా మళ్లీ పైకి లేచిందన్నట్లుగా పద్నాలుగేళ్ల క్రితంనాటి ‘ఆదాయానికి మించి ఆస్తుల కేసు’ తెర మీదికి వచ్చింది. ఇది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టుకు సంబంధించిన వ్యవహారం. ఎన్టీఆర్‌ భార్య, చంద్రబాబు బద్ధ శత్రువు, ఇప్పుడు ఏపీ తెలుగు అకాడెమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి 14 ఏళ్ల కిందట ఈ కేసు వేసింది. అంటే ఉమ్మడి ఏపీలో దాఖలైన కేసన్నమాట. ఏ కేసులోనైనా స్టే తెచ్చుకునే సత్తా చంద్రబాబుకు ఉందని రాజకీయ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. ఈ కేసూ ఇప్పటివరకు స్టే మీదనే ఉంది. కాని సుప్రీం కోర్టు నిర్ణయంతో బాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్టే ఎత్తేశారు. దీంతో విచారణకు రెడీ అయ్యింది. మరి విచారణ అన్నప్పుడు బాబు కోర్టుకు హాజరుకావాలి కదా. అందులోనూ ఆయన ఏ పదవీ లేని ప్రతిపక్ష నాయకుడు. ‘నాకు తీరిక లేదు…రాలేను’ అని చెప్పేందుకు అవకాశముండదు. ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళతాడని వైకాపా నాయకులు సంతోషపడుతున్నారు. ‘నేను నిప్పులాంటి మనిషిని. జీవితంలో ఏ తప్పూ చేయలేదు. వైఎస్‌ఆర్‌ నా మీద 26 కేసులు పెట్టి ఏం చేయలేకపోయాడు’ అని బాబు చాలాసార్లు అన్నారు. మరి ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం జరుగుతుంది? జగన్‌ జైలుకు వెళితే వైకాపా ముక్కలవుతుందని టీడీపీవాళ్లు చెబుతుండగా, బాబు జైలుకు వెళితే టీడీపీ కథ ముగిసిపోయినట్లేననని వైకాపా వాళ్లు చెబుతున్నారు. చూడాలి…ఎవరి జాతకాలు ఏమిటో….!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close