వరద ప్రభుత్వ వైపరీత్యమే..! చంద్రబాబు ప్రజంటేషన్…!

అమరావతి ముంపు ప్రాంతమని… కుట్రపూరితంగా నిరూపించేందుకు ప్రభుత్వం… రాయలసీమకు సైతం నీళ్లివ్వకుండా..కృష్ణానదిలో కృత్రిమ వరద సృష్టించిందని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కృష్ణా నదిలో ప్రవాహాలు ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నాయి..? ఏ ఏ ప్రాజెక్టులకు ఏ సమయంలో తరలించుకోవాలి..? ఏపీ సర్కార్ ఎప్పుడు తరలించింది..? ఇలా ప్రతి విషయాన్ని.. చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉద్దేశపూర్వకంగా నీళ్లంటిని బిగబట్టి.. ఒక్క సారి ప్రకాశం బ్యారేజీ వైపు వదలారని.. స్పష్టం చేశారు. దీని వల్ల రాజధాని గ్రామాల్లోకి నీరు వస్తుందని.. తన ఇంట్లోకి కూడా నీరొస్తే.. రాజధానికి ముంపు ముప్పు ఉందని చెప్పాలనుకున్నారని మండిపడ్డారు.

ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు వరద రావాలంటే 12 గంటలు, నారాయణపూర్‌ నుంచి జూరాలకు 30 , జూరాల నుంచి శ్రీశైలానికి 30 గంటలు, శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద రావాలంటే 12 గంటలు, సాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీకి రావాలంటే 24 గంటలు పడుతుందని .. అంటే.. బ్యారేజీ వద్దకు అల్మట్టి నుంచి… బ్యారేజీకి రావడానికి ఐదారు రోజులు సమయం పడుతుంది. ఇంత సమయం లభించినా… ఎంత వరద వస్తుందో.. కేంద్ర జల సంఘం నుంచి స్పష్టమైన సమాచారం.. ఎప్పటికప్పుడు.. ప్రభుత్వానికి సమాచారం ఉన్నా.. నీటిని ఎందుకు బిగపట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. వరదలు వచ్చే సమయానికి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని … అలాంటి సమయంలో వచ్చిన వరదల్ని చాలా జాగ్రత్తగా… ప్రాజెక్టుల్ని నింపుకునే అవకాశం ఉన్నా.. వినియోగించుకోలేదన్నారు. ఆగస్టు ఏడో తేదీ వరకూ… రాయలసీమకు నీటిని ఎదుకు పంపింగ్ ప్రారంభించలేదో చెప్పాలన్నారు. కండలేరు, సోమశిల సహా పలు రిజర్వాయర్లకు నీటిని పంపలేకపోయారన్నారు.

నేను ఉంటున్న ఇంటిని ముంచడం కోసం.. కృష్ణా పరివాహక లంక గ్రామాలన్నింటినీ ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయకపోతే ప్రభుత్వంలో ఉండే అర్హతే లేదని తేల్చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు సుమారు రూ.3వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఎందుకు తప్పుడు విధానాలు అవలంబించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సృష్టించిన వరదలు కాబట్టి రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణతో సంబంధాలు బాగున్నాయని చెబుతున్నారు.. పోతిరెడ్డిపాడుకు మళ్లిస్తేనే ఓర్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉందన్నారు.

ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. న్యాయపోరాటం చేయాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర జలసంఘానికి.. ప్రాజెక్టుల నిర్వహణ తీరుపై.. ముందుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కేంద్ర జలసంఘం హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. ప్రజల్ని ముంచిన వైనాన్ని.. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com