దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్-2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేయబోతున్నారు. భారత్ మండపంలో జరుగుతున్న ఈ 11వ ఎడిషన్ సదస్సు లో ఆయన పాల్గొంటున్నారు. ఈ వేదికపై ఆయన సాంకేతికత – సుపరిపాలన – భవిష్యత్తు అనే ప్రధానాంశంపై తన ప్రసంగాన్ని వినిపించనున్నారు.
ఈ ప్రసంగంలో భాగంగా చంద్రబాబు.. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ ( , డేటా ఆధారిత నిర్ణయాలు, పౌర సేవల్లో డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా పారదర్శకతను పెంచడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం , ఆంధ్రప్రదేశ్‌ను ఒక అడ్వాన్స్డ్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తనకున్న విజన్‌ను ఆయన ఈ అంతర్జాతీయ వేదికపై పంచుకోనున్నారు.
రైసినా డైలాగ్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక సదస్సు. దీనిని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా 2016 నుండి నిర్వహిస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య ఎదురవుతున్న భూ రాజకీయ , , భూ-ఆర్థిక సవాళ్లపై చర్చించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. సింగపూర్‌లోని షాంగ్రిలా డైలాగ్ తరహాలోనే, దీనిని గ్లోబల్ లీడర్లు, పాలసీ మేకర్లు, వ్యాపారవేత్తలు , మేధావులు కలిసే ఇండియాస్ ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ గా భావిస్తారు.
ఈ ఏడాది సదస్సుకు ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 110 దేశాలకు చెందిన సుమారు 2,700 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని భవిష్యత్తు గ్లోబల్ ఆర్డర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
