దీక్షకు దీటైన పాచిక లేని టిడిపి

ఎపిలోనే గాక ఢిల్లీలోనూ రాష్ట్ర రాజకీయాలు టీడీపీ వైసీపీ వ్యూహాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రతిపక్షాలన్నీ బయిట హారంగా నిలబడ్డాయి. తమాషాగా అవిశ్వాసం నోటీసు మొదట ఇచ్చిన వైసీపీ, దాన్ని చర్చకు రాకుండా చేయడానికి సహకరించిన అన్నా డిఎంకె మాత్రమే ఈ హారంలో పాలుపంచుకోలేదు. దీనిపై సాక్షి చర్చలో దీన్ని ప్రస్తావిస్తే కొమ్మినేని శ్రీనివాసరావుతో కాస్త వాదన జరిగింది. ఆంధ్రజ్యోతి లో ఏం రాశారో ఆయన చెప్పారు. మరి వైసీపీ పాల్గొనలేదని వీరెందుకు రాయలేదని నేను అడిగాను. వైఎస్‌ఆర్‌ ఫోటో వేసుకుని నడుపుతున్నారు గనక అలా చేయొచ్చునని ఆయన సమర్థన. బిజెపిని వ్యతిరేకం చేసుకోరాదు గనకే దూరంగా వున్నారన్నది స్పష్టం. జగన్‌ చంద్రబాబు ప్రభుత్వంపై తెలుగుదేశంపై విమర్శలు చేయొచ్చు గాని కేంద్రం నిరాకరణను నిశితంగా విమర్శించకపోతే విశ్వసనీయత రాదు. తాము ఇంత కాలం హౌదా సమస్యను సజీవంగా వుంచినందుకే చంద్రబాబు యు టర్న్‌ తీసుకున్నారని వైసీపీ చెబుతున్న మాట. ఇలాటి సమయంలో వైసీపీ మోడీ ప్రభుత్వంపై రాజకీయంగా దృఢ వైఖరి ప్రదర్శించలేకపోవడం టిడిపి వ్యూహాలకే అవకాశమిస్తున్న ది. అదే మాట నేను సాక్షి తెరపైనే చెప్పాను.

లోక్‌సభ వాయిదా తర్వాత వైసీపీ ఎంపిలు రాజీనామా చేయడం, ఎపి భవన్‌లో నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించడం వేడి పెంచింది. దానికి దీటుగా కనిపించడం కోసం టిడిపి నానా పాట్టు పడాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా ప్రభుత్వంలో కొనసాగిన టిడిపి ఎంపిలు సభ ముగిశాక ప్రధాని కూచునే ఖాళీ స్థానం దగ్గర తర్వాత స్పీకర్‌ కార్యాలయంలో నిరసన తెలిపి మార్షల్స్‌ తొలగింపునకు గురికావడం అందులో భాగమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారందరినీ ఢిల్లీలోనే వుండమని ఆదేశించారట. తన ఢిల్లీ యాత్ర ఫలితాల కొనసాగింపుపై ఆయన అఖిలపక్షం ఏర్పాటు చేసి సమాచారం పంపగా దాదాపు అన్ని పార్టీలూ తిరస్కరించాయి. రాజకీయంగా తెలుగుదేశం కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నదనే సంకేతాలు రావడం పట్ల ఎపిసిప అద్యక్షుడు రఘువీరారెడ్డి ి ఆందోళన చెంది తమకు ఎలాటి పొత్తు వుండబోదని స్పష్టం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. . వైసీపీ నేతలు బిజెపితో కలసి పోతున్నారని చెప్పడానికి టిడిపి అనుకూల మీడియా కేంద్రీకరించి ప్రసారాలు చేస్తున్నది. చంద్రబాబు ఢిల్లీలోచక్రం తిప్పిన రోజుల గురించి ఆయన వందిమాగధులు ప్రచారం చేయడమే గాని అప్పటి వలె ఆయనకు అండగా నిలబడే హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ జ్యోతిబాసు వంటి దిగ్గజాలు లేరు. రెండుసార్లు లౌకిక శిబిరం నుంచి బిజెపికి మారడం ద్వారా విశ్వసనీయత దెబ్బతినిపోయింది.ఇప్పుడు ప్యాకేజీ విషయంలో చేసిన విన్యాసాలు మరింత విలువ తగ్గించాయి. అందుకే పెద్ద స్పందన రాలేదు. మీడియాలో వెంటాడిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోయారు. నెల రోజులుగా అరిగిపోయిన రికార్డులాగా ఆయన ఒకే కథ వినిపిస్తున్నా వినేవారు లేకపోవడం స్వయం కృతాపరాధమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీపీఎస్ రద్దుకు “వారం” వచ్చేది అప్పుడే !?

అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ కు ఇంకా ఆ వారం రాలేదు. రాదని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు. ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కా‌ర్ అత్యంత...

తప్పు చేసి ఎస్పీని ఇరికించేసిన తెలంగాణ మంత్రి !

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫ్రీడం ర్యాలీ పేరుతో జాతీయ జెండాలతో ర్యాలీ చేసి.. అదేదో బారాత్ అయినట్లుగా పోలీసుల దగ్గర తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపేశారు. అదేమంటే.....

అక్టోబర్ ఐదు నుంచి పవన్ యాత్ర !

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనుకుంటున్న పవన్ కల్యాణ్ అక్టోబర్ ఐదో తేదీని ముహుర్తంగా ఖరారు చేసుకున్నారు. ఇప్పటి వరకూ కౌలు రైతు భరోసా యాత్ర.. అలాగే జనవాణి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....

మునుగోడును చక్క బెడుతున్న కేసీఆర్ !

మునుగోడు ఉపఎన్నికలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా చక్కబెడుతున్నారు. హుజూరాబాద్‌లో జరిగిన తప్పులు ఇక్కడ జరకుండా చూసుకుంటున్నారు. ఈ సారి అక్కడి బాధ్యతను హరీష్‌కు పూర్తి స్థాయిలో అప్పగించడంలేదు. మంత్రి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close