వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇలా విషెష్ చేసిన వారిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు జగన్ రెడ్డి సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఉన్నారు.
షర్మిల పుట్టిన పుట్టిన రోజు నాలుగు రోజుల కిందట జరిగింది. ఆ రోజున అందరూ శుభాకాంక్షలు చెప్పారు కానీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి శుభాకాంక్షలు రాలేదు. కానీ షర్మిల మాత్రం అవేమీ గుర్తు పెట్టుకోకుండా వైసీపీ అధినేతగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే మాట వరుసకు కూడా సోదరుడు అని సంబోధించలేదు.
జగన్ పుట్టినరోజును బెంగళూరులోనే జరుపుకుంటున్నారు. పార్టీ క్యాడర్ కు మాత్రం ఎక్కడికక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు సూచనలు వెళ్లాయి. వారు కొన్ని చోట్ల జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
