మోడీ చుట్టూ 101 ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి..మరి

బాబుగారి రెండు కళ్ళ సిద్దాంతాన్ని మొదట్లో చాలా మంది అపహాస్యం చేసినప్పటికీ ఇప్పుడు హరీష్ రావు వంటి నేతలు కూడా సిద్ధిపేట, నారాయణ ఖేడ్ నాకు రెండు కళ్ళ వంటివి అని చెప్పుకొంటుంటే, బాబుగారిని తీవ్రంగా వ్యతిరేకించే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాపులు, బీసీలు నాకు రెండు కళ్ళ వంటి వారు అని చెప్పుకొంటున్నారు. కనుక బాబుగారు కనిపెట్టిన రెండు కళ్ళ సిద్దాంతం రాజకీయంగా ఆమోదం పొందినట్లే చెప్పుకోవచ్చును. కానీ ఆయన ఆంధ్రా, తెలంగాణాలలో చేస్తున్న రెండు పడవల ప్రయాణం మాత్రం సజావుగా సాగడం లేదు. పైగా దానిని తెరాస అధినేత కేసీఆర్ అస్సలు లైక్ చేయకపోవడంతో తెలంగాణా తెదేపా పడవకి కన్నం పెట్టేసారు.

ప్రమాదం పసిగట్టిన బాబుగారు ఆంధ్రా పడవలోకి జంప్ అయిపోయారు కానీ రెండో పడవలో మిగిలిపోయిన తెలుగు తమ్ముళ్ళు అందరూ మునిగిపోయే ప్రమాదం కనబడుతోంది. వారిని రక్షించేందుకు బాబుగారు తన లోకేష్ బాబుని పంపితే అతను పడవలో కాలు పెడుతూనే “మనం మునిగిపోవడం ఖాయం” అని అనౌన్స్ చేసేసారు. లోకేష్ బాబుకి రాజకీయాలలో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ చాలా చక్కగా జోస్యం చెప్పారు. లోకేష్ బాబు గ్రేటర్ లో తన పడవని ఒడ్డుకు చేర్చలేకపోయినా అంత కరెక్టుగా జోస్యం చెప్పడం మామూలు విషయమేమీ కాదు. అందుకే “మనం ఏదీ ఆశించకపోతే పడవ మునిగిపోయినా బాధ కలగదు,” అని చంద్రబాబు గారు గొప్ప సందేశం ఇచ్చారు.

అప్పటికే రెండు మంత్రి పదవులు వెనకేసుకొన్న కె.టి.ఆర్. ‘నాన్నకు ప్రేమతో…’ గ్రేటర్ ఇచ్చినందుకు ఆయన కూడా బాగా కుష్ అయిపోయి మునిసిపల్ మంత్రి పదవిని కొడుకుకి గిఫ్ట్ గా ఇచ్చేసారు. ఆ ముఖ్యమంత్రి కొడుకుకి మంత్రి పదవి గిఫ్ట్ ఇస్తే, ఈ ముఖ్యమంత్రి కొడుకికి ఇవ్వకపోతే చాలా నామోషీగా ఉంటుందని, కనుక రాజ్యసభలో సుజానా చౌదరి ఖాళీ చేయబోయే కుర్చీలో ఒక కాలు, ఆయన చేత కేంద్ర మంత్రి కుర్చీని కూడా ఖాళీ చేయించేసి అందులో మరొక కాలు వేయించి మన లోకేష్ బాబుని కూర్చోబెట్టేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలు బాబుగారి మీద తెగ ఒత్తిడి చేసేస్తున్నట్లు మీడియాలో (సాక్షి మీడియాలో తప్ప) వార్తలు తెగ లీక్ అయిపోతున్నాయి. ఇక మీడియాలో అంత ఒత్తిడి చేస్తుంటే బాబుగారు వారి మాటను కొట్టేయడం ఇష్టం లేక లోకేష్ బాబు ని డిల్లీకి పంపేయాలని డిసైడ్ అయినట్లు కూడా మీడియాలో లీక్ అయిపోయింది.

కానీ చంద్రబాబు నాయుడు కష్టాలు మాత్రం ఎంతకీ తీరడం లేదు. ఆయనకీ ఓపిక ఉన్నా లేకపోయినా ఈ వయసులో కూడా (తనను నమ్ముకొన్న ప్రజల కోసం) కష్టపడవలసి వస్తోంది. కానీ సున్నితమయిన, దృడమయిన, విశాలమయిన ఆయన మనసుని ఎవరూ అర్ధం చేసుకోరు. ముఖ్యంగా జగన్ అసలే అర్ధం చేసుకోడు. ఎప్పుడూ ఏదో విమర్శలు చేస్తూనే ఉంటాడు..లేకుంటే ఏదో ఓ పేరుతో ఉద్యమాలు చేస్తూ బాబుగారిని ఇబ్బంది పెడుతుంటాడు. చిన్న పెద్దా అంతరం కూడా చూడడు.

ఇక రఘువీరా రెడ్డి కూడా అంతే. కానీ ఆయన అసెంబ్లీలో కాలు పెట్టలేడు కనుక బాబు గారు అతనిని పెద్దగా పట్టించుకోరు. మొన్నటి దాక కాపులు, బీసీలు బాబుగారికి అగ్నిపరీక్షలు పెడితే అందులో ఆయన పాస్ అయిపోయారు కానీ ఆ ఆనడంలో బాబుగారి టాంగ్ స్లిప్ అయిపోయింది. ఎస్సీల గురించి ఏదో అనేయడంతో ఇప్పుడు వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పుకొని మళ్ళీ ప్రతిపక్షాలు బాబుగారితో చెడుగుడు ఆడేసుకొంటున్నాయి.

ఈ బాధల నుండి శాంతి పొందాలంటే డిల్లీ వెళ్లి అక్కడ మోడీగారి చుట్టూ 101వ సార్లు ‘ప్రత్యేక ప్రదక్షిణాలు’ చేస్తే మంచిదని ఎవరో చెప్పడంతో అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పటికే 100సార్లు అయిపోయాయి. ఇది 101వ సారి అవుతుంది కనుక ఏదో ఒక ఫలితం కనిపిస్తుందని బాబుగారు ఆశ. ఒకవేళ ఫలితం కనిపించకపోయినా మోడీ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న సమయంలో ఆయన చెవిలో లోకేష్ బాబు గురించి ఓ మాట పడేస్తే ఓ పనయిపోతుంది. అయితే ఆయన ‘ఆ పని మీదే’ డిల్లీకి వెళ్ళలేదని అందరికీ తెలుసు. కానీ జగన్ ఒప్పుకొంటాడనే నమ్మకం లేదు. రాష్ట్రం గురించి ఆలోచించకుండా కొడుకుకి కేంద్ర మంత్రి పదవి కోసమే డిల్లీకి వెళ్లి మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని ఏవేవో వాగేసి బాబుగారి సున్నితమయిన మనసుని గాయపరచకుండా ఉండడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

దూబే హతం..! బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే ఆన్సర్..!

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతనిని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. మరో విమర్శకు తావివ్వకుండా...యూపీ శివార్లలోనే ఎన్‌కౌంటర్ చేసేశారు. డీఎస్పీ...

ఎడిటర్స్‌ కామెంట్ : తెలంగాణ ప్రజలకు శాపమే..!

" నేను ఎక్కడ ఉంటే అదే సచివాలయం.. ముఖ్యమత్రి అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ..!" .. అంటూ... రెండో సారి గెలిచిన సమయంలో మీడియాతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీని నేపధ్యం.. కేసీఆర్ అసలు...

HOT NEWS

[X] Close
[X] Close