విజయవాడలో ‘ట్రెండ్‌సెట్‌’మాల్‌ను ప్రారంభించిన చంద్రబాబు, వెంకయ్య

హైదరాబాద్: దినదినాభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరానికి మరో ఆకర్షణ వచ్చి చేరింది. ప్రముఖ తెలుగు నిర్మాత కేఎల్ నారాయణ బెంజ్ సర్కిల్‌లో నిర్మించిన ట్రెండ్‌సెట్ మాల్‌‍ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు ఇవాళ ప్రారంభించారు. ఈ మాల్‌లోనే సురేష్ ప్రొడక్షన్స్, ప్రసాద్ ల్యాబ్స్ కలిసి ఏర్పాటు చేసిన 6 స్క్రీన్‌ల క్యాపిటల్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను కూడా వారు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీఎమ్ మాట్లాడుతూ, నవ్యాంధ్రకు వచ్చే తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. రాజధాని అభివృద్ధికి ఇలాంటి మాల్స్ దోహదపడతాయని అన్నారు. కృష్ణాజిల్లాలో మేధావులు ఎక్కువగా ఉన్నారని, వాళ్ళ మేధస్సు రాజధాని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రాజధాని అంటే కాంక్రీట్ బిల్డింగులు, రోడ్లే కాదని, అక్కడ జీవం ఉండాలని, విద్యాసంస్థలు, వినోదం, వ్యాపారం, వైద్యం అన్నీ ఉంటేనే జీవం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులతోపాటు హీరో వెంకటేష్ కూడా పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి... బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే...

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

HOT NEWS

[X] Close
[X] Close