చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఒకే సారి ఏడు పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.2,203 కోట్లు ఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇవన్నీ భారీగా ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమలే. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E–Royce EV, ALEAP మహిళా పార్కు తమ ఫ్యాక్టరీల నిర్మాణాలను ప్రారంభిస్తున్నాయి. ఇందులో హిందాల్కో పరిశ్రమ రాక ప్రత్యేకమైనది.ఈ కంపెనీ ఐ ఫోన్ కాంపోనెంట్లను తయారు చేస్తుంది.
కుప్పంలో మూతబడిపోయిన పాత అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను హిందాల్కో ఇప్పటికే కొనుగోలు చేసింది. ఆ ప్లాంట్ లో ఐ ఫోన్ కాంపోనెంట్ల ఉత్పత్తికి అవసరమైన మెషినరీని.. ఏర్పాటు చేసుకోనుంది. మొత్తం అత్యాధునికంగా మార్చనుంది. 2026 చివరి నాటికి ఉత్పత్తికి అనుగుణంగా నిర్మాణం పూర్తి చేసుకుంటారు.. 2027 నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. బెంగళూరులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ ..కుప్పంకు సమీపంలో ఉంటుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ లో హిందాల్కో ఓ భాగం.
త్వరలో మరో మరో 8 కంపెనీలు రూ.6,300 కోట్ల పెట్టుబడులతో వస్తాయని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మొత్తం స్థానికంగానే తయారు చేస్తామని, ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు సౌరవిద్యుత్ అందిస్తామన్నారు. కుప్పంలో ఎక్కువ మంది ఉపాధి కోసం సమీపంలో ఉన్న బెంగళూరుకు వెళ్తారు. అలా వెళ్లే అవకాశాలు తగ్గించి.. ఉపాధి కల్పించేందుకు..ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో పని చేసే నైపుణ్యాలను ఇప్పించేందుకు చంద్రబాబు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


