క్లింటన్‌కు బాబు “గోడ”.. ట్రంప్‌కు మోడీ “గోడ”..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24న ఇండియాకు వస్తున్నారు. ఆయన అహ్మాదాబాద్‌లోని మెతెరా క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించి .. అక్కడే జరగబోయే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు అంటే.. ఆయన రేంజ్‌కు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలి. పైగా మోడీ కాబట్టి… ఏ లోటూ రానీయరు. అందులో భాగంగా.. అహ్మదాబాద్‌లో ఓ గోడ కడుతున్నారు. ఈ గోడ ఎందుకు కడుతున్నారంటే.. ఒక మురికివాడ కనిపించకుండా చేయడానికి. ఆ మురికివాడ ఎయిర్‌పోర్ట్ నుంచి సబర్మతి ఆశ్రమానికి వెళ్లే దారిలో ఉంటుంది. ప్రధాన మార్గం పక్కనే ఉన్న మురికివాడను కనిపించకుండా చేయడానికి ఆరేడు అడుగుల ఎత్తు గోడ అర కిలోమీటర్ పొడవునా చకచకా కట్టేస్తున్నారు.

సహజంగానే.. ప్రభుత్వం తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం పేదరికాన్ని దాచిపెట్టాలని, మురికివాడను కనిపించకుండా చేయాలని అనుకుంటోందని మండి పడుతున్నారు. అయితే.. ఇలా ఈ మురికివాడ కనిపించకుండా గోడకట్టడం ఇదే మొదటి సారి కాదు. గతంలో బిల్ క్లింటన్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు.. చంద్రబాబు.. హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఆ సమయంలో బిల్ క్లింటన్ షెడ్యూల్‌లో లేకపోయినా హైదరాబాద్ వచ్చారు. దాంతో.. చంద్రబాబు.. హైదరాబాద్ సొగసుల్ని చూపించడానికి తంటాలు పడ్డారు. మురికి వాడలు కనిపించకుండా.. తెరలు.. గోడలు కట్టించారు. క్లింటన్ రాక కోసం.. చేసిన ఏర్పాట్ల గురించి ఇప్పటికీ… అప్పటి నేతలు .. అధికారులు… చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అహ్మదాబాద్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

గోడలు కట్టేస్తే పేదరికం కనిపించకుండా పోతుంది కానీ.. అంతరించి పోదని.. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పాలకులు దేశ పరిస్థితిని… ప్రత్యక్ష పర్యటనకు వచ్చినప్పుడు విదేశీ దేశాధినేతల ముందు దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అదే వాస్తవం. ఎన్ని ప్రభుత్వాలు మారినా… ఎన్ని లక్షల కోట్లు పేదరికం నిర్మూలనకు వెచ్చించినా.. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదవాళ్లు.. మరింత పేదవాళ్లు అవుతున్నారు. వారి స్థితిగతుల్లో మార్పు రావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

జగన్ పట్టుబట్టినా కర్ణాటకకే “మందాకిని”..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా... ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు...

HOT NEWS

[X] Close
[X] Close