రాత్రికి రాత్రే దేశప్రజలను షాక్‌కు గురిచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు రూ. 500, రూ. 1000 నోట్ల చెలామణిని రద్దు చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం ఈ నోట్లు చేతిలో ఉన్నవారు ఏమాత్రం కంగారు పడాల్సిన పనిలేదు. డిసెంబర్ 30వ తేదీలో ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చు. ఈ కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేయబోతోంది. అయితే, ఈ నిర్ణయంతో నల్లధనవంతుల గుండెల్లో రాయిపడ్డట్టే లెక్క! ఇంతవరకూ లెక్కలు చెప్పనివారు ఇప్పుడు చచ్చినట్టు చూపించాల్సి వస్తుంది. నిజానికి, ఇప్పటికే స్వచ్ఛందంగా నల్లధనం ప్రకటించే అవకాశాన్ని గత నెలలోనే ప్రభుత్వం ఇచ్చింది. కానీ, ఇంకా దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడానికి, దొంగనోట్ల చెలామణికి ఆటకట్టించడానికి ఈ కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు.
ప్రధాని ప్రకటన తరువాత… అందరి దృష్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పడుతోంది! ఎందుకంటే, ఈ మధ్య నల్లధనం గురించి ఆయన మాట్లాడుతూ రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు. క్యాష్‌లెస్ ట్రాంజాక్షన్స్ పెరగాలనీ, లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరగాలనీ, అప్పుడే నల్లధనానికి ఆస్కారం లేకుండా పోతుందనీ, ఆర్థిక విషయాల్లో పారదర్శకతవ వస్తుందని ఆయన అన్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లబోతున్నాను అని కూడా చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై చాలా విమర్శలు వినిపించాయి. చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని కూడా కొంతమంది విమర్శించారు. ఓ పక్క రూ. 2000 నోట్లను అమల్లోకి తెస్తామని ప్రభుత్వం చెబుతూ ఉంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేంటీ అని కూడా అనుకున్నారు.
కానీ, నేడు ప్రధానమంత్రి నిర్ణయం చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఉంది. ఇంతకీ, ఈ నిర్ణయం వెనక చంద్రబాబు సలహా ప్రధానిపై పనిచేసిందా అనే చర్చ మొదలైంది. చంద్రబాబు రాసిన లేఖ అనుగుణంగానే ఈ కరెన్సీ నోట్లను బ్యాన్ చేయాలని కేంద్రం భావించిందా అనే భావన కలుగుతోంది. ఈ దిశగా ప్రధానిని ప్రేరేపించిన కారణాలు వేరేవి ఉన్నా కూడా… కొంత క్రెడిట్ చంద్రబాబుకి దక్కుతుందని మాత్రం చెప్పొచ్చు! ఎందుకంటే, అంతా ఆయన మాట్లాడినట్టుగానే జరిగింది కదా! ఒకవేళ ఈ చారిత్రిక నిర్ణయం కాకతాళీయంగా చంద్రబాబు అభిప్రాయానికి సరిపోయినా కూడా ఆ క్రెడిట్‌ను కొంతైనా తమ ఖాతాలోకి చంద్రబాబు మళ్లించుకుంటారు కదా..!
I welcome @narendramodi Govt's historic decision to ban Rs.500 & Rs.1000 notes. This is bold step towards eliminating corruption. (1/4)
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2016
TDP has been at the forefront of pushing for this ban on high-value currency notes. This move will change the face of Indian economy. (2/4)
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2016
Re-introduction of Rs.500 notes, introduction of Rs.2000 notes needs elaborate discussions & alternatives should be looked into. (3/4)
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2016
Centre needs to reassess the steps &tread with caution before introducing new denominations, to eliminate stash #IndiaFightsCorruption (4/4)
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2016