చందూ క‌మ‌ర్షియ‌ల్ పాఠాలు నేర్చుకున్న‌ట్టేనా?

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ అనే పిలుపు బాగానే ఉంటుంది. కానీ… క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ కే వాల్యూ. ఓ సినిమాకి విమర్శ‌కుల ప్ర‌శంస‌లు వ‌చ్చినంత మాత్రాన చాల‌దు. క‌మ‌ర్షియ‌ల్ గానూ వ‌ర్క‌వుట్ అవ్వాలి. నిర్మాత‌కు నాలుగు డబ్బులు రావాలి. `మంచి సినిమా తీశారు.. భేష్‌` అంటూ భుజం త‌డితే.. అప్ప‌టికి మాన‌సిక సంతృప్తి ల‌భిస్తుందేమో.. అయితే అంతిమంగా ఆ సినిమా జ‌యాప‌జ‌యాలు నిర్ణ‌యించేది క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లే.

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ గా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటికి మంచి పేరుంది. `ఐతే` నుంచి మొన్న‌టి `మ‌న‌మంతా` వ‌ర‌కూ ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. మంచి క‌థ‌లే. విభిన్న ప్ర‌య‌త్నాలే చేశాడు. కానీ.. క‌మ‌ర్షియ‌ల్ గా ఆ సినిమాలు అనుకున్నంత ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయాయి. ఇప్పుడాయ‌న `చెక్‌` రూపంలో మ‌రో ప్ర‌య‌త్నం చేశారు. శుక్ర‌వార‌మే విడుద‌ల‌. చెక్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో… `ఈ సినిమాతో మీకు మంచి పేరొస్తుంది` అని చంద్ర‌శేఖ‌ర్ ఏలేటిని ఉద్దేశించి నితిన్ పొగిడితే.. `నాకు పేరొద్దు.. డ‌బ్బులు కావాలి` అని చందూ వెంట‌నే జ‌వాబు ఇచ్చారు. దాన్ని బ‌ట్టి… చంద్ర‌శేఖ‌ర్ యేలేటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ ని ఎంత‌గా కోరుకుంటున్నాడో అర్థం అవుతోంది.

తాను క‌మ‌ర్షియ‌ల్ సినిమాలూ తీయ‌గ‌ల‌న‌ని నిరూపించుకోవ‌డానికి `చెక్‌` ఓ ఆస‌రా. దాన్ని చంద్ర‌శేఖ‌ర్ బాగానే వాడుకున్నాడ‌ని టాక్‌. ఈసారి ఎలాగైనా స‌రే, డ‌బ్బులొచ్చే సినిమానే తీయాలి… అని చందూ ఫిక్సయ్యాడ‌ని, అందుకే `చెక్‌`లో క‌మ‌ర్షియాలిటీ బాగా మిక్స్ చేశాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. అలాగ‌ని.. త‌న శైలికి భిన్నంగా భారీ ప్ర‌యోగాలేం చేయ‌లేదు. అందులో త‌న ట‌చ్ ఉండేలానూ జాగ్ర‌త్త ప‌డ్డాడ‌ట‌. చందూ లాంటి ద‌ర్శ‌కుల‌కు ఒక‌ట్రెండు క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ ప‌డ‌డం అవ‌స‌రం. ఎందుకంటే.. అప్పుడే కొత్త త‌ర‌హా సినిమాల్ని ఇంకాస్త ధైర్యంగా తీయ‌గ‌ల‌గుతారు. మ‌రి… `చెక్‌` చందూలోని క‌మ‌ర్షియాలిటీని బ‌య‌ట‌కు తీసుకొస్తుందా? లేదంటే పూర్తిగా త‌న సృజ‌నాత్మ‌క‌త‌కే చెక్ పెడుతుందా? అనేది తేలాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మంచోడంటున్న నాగబాబు..!

విక్రమార్కుడు సినిమాలో  ఓ సీన్ ఉంటుంది. ఓ పోలీస్ అధికారి భార్యను ఆ ఊరిలో అధికారం చెలాయించే పెద్ద మనిషి కొడుకు ఎత్తుకొచ్చి శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు.  తన భార్య అక్కడే...

ఇక బీజేపీకి పవన్ ప్రచారం లేనట్టే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత ప్రచారానికి వస్తారని ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు క్వారంటైన్ షాక్ తగిలింది. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లుగా తేలడంతో...

ఆ వీడియో చూపించారని దేవినేని ఉమపై కేసు..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై కేసులు పెట్టడం సహజమే. ముఖ్యంగా సీఐడీ పోలీసులు ఆ విషయంలో చాలా ముందు ఉంటారు. ఎవరో చెబుతున్నట్లుగా చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. తాజాగా మాజీ మంత్రి...

జగన్ నిర్ణయాలను తానే తీసుకుంటున్న పెద్దిరెడ్డి..!

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో జగన్ తర్వాత తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో.. జగన్ కన్నా తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో కానీ... అప్పుడప్పుడూ... కాస్త తేడా ప్రకటనలు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close