‘కార్తికేయ 3’ ఎప్పుడు..?!

నిఖిల్ కెరీర్‌లో ‘కార్తికేయ’ ఓ మంచి హిట్. దానికి సీక్వెల్ గా వ‌చ్చిన ‘కార్తికేయ 2’ ఊహించ‌నంత భారీ విజ‌యాన్ని అందుకొంది. బాలీవుడ్ లోనూ స‌త్తా చాటింది. ఈ చిత్రానికి ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సైతం అందింది. అందుకే ఇప్పుడు అంద‌రి దృష్టీ ‘కార్తికేయ 3’ పై ప‌డింది. ‘కార్తికేయ 3’ వ‌స్తుంద‌ని ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ముందే చెప్పాడు. దానికి త‌గిన క‌థ కూడా సిద్ధ‌మైంది. అయితే చందూ ప్ర‌స్తుతం నాగ చైతన్య‌తో ‘తండేల్’ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ‘కార్తికేయ 3’ సెట్స్ పైకి తీసుకెళ్తాన‌ని చందూ మొండేటి క్లారిటీ ఇచ్చాడు.

నాగ‌చైత‌న్య – సాయి ప‌ల్ల‌వి జంట‌గా నటిస్తున్న ‘తండేల్‌’ షూటింగ్ శ‌ర వేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా విడుద‌ల మాత్రం కాస్త క‌న్‌ఫ్యూజ‌న్ స్టేజ్‌లో ఉంది. 2025 జ‌న‌వ‌రికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ముందే చెప్పింది. అయితే సంక్రాంతికి గ‌ట్టి పోటీ ఉన్న నేప‌థ్యంలో డిసెంబ‌రులోనే తండేల్ విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ డిసెంబ‌రులోనూ భారీ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ‘పుష్ష 2’, ‘గేమ్ ఛేంజ‌ర్’ డిసెంబ‌రులో ఢీ కొట్ట‌బోతున్నాయి. దాంతో ‘తండేల్’ డ్రాప్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. పైగా తండేల్ కి సంబంధించిన సీజీ వ‌ర్క్ చాలా ఉంద‌ట‌. సీజీతో పెట్టుకొంటే, అవుట్ పుట్ ఎప్పుడొస్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకే నిర్మాత బ‌న్నీ వాస్ కూడా తండేల్ విడుద‌ల తేదీపై ఓ స్ప‌ష్ట‌త‌కు రాలేక‌పోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టేకోవర్ చేస్తున్నారా?

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు క‌విత భుజానికెత్తుకున్న ఉద్య‌మాన్ని ఇక కేటీఆర్ న‌డ‌ప‌బోతున్నారా...? క‌వితను రాజ‌కీయంగా సైలెంట్ చేసే అవ‌కాశం ఉందా...? బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై...

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close