‘స‌ర్కారు వారి పాట’‌… కీల‌క మార్పు

మ‌హేష్ – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `సర్కారువారి పాట‌`. క‌థానాయ‌క‌గా కీర్తి సురేష్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. అమెరికాలో చిత్రీక‌ర‌ణ మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ అమెరికాలోనే ఉన్నాడు. లొకేష‌న్ల వేట కొన‌సాగిస్తున్నాడు. ఈలోగా.. ఈ టీమ్ లో ఓ కీల‌క‌మైన మార్పు జ‌రిగింది. ఈ చిత్రానికి కెమెరామెన్ గా పి.ఎస్‌. వినోద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. ఆయ‌న స్థానంలో మ‌ది వ‌చ్చి చేరారు.

పీ.ఎస్ వినోద్ ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్` కోసం ప‌నిచేస్తున్నారు. స‌ర్కారువారి పాట మొద‌ల‌య్యే స‌రికి వ‌కీల్ సాబ్ సినిమా పూర్త‌వుతుంద‌నుకున్నారు. కానీ.. లాక్ డౌన్ వ‌ల్ల అది సాధ్యం కాలేదు. అతి త్వ‌ర‌లో వ‌కీల్ సాబ్ సినిమా మొద‌ల‌వుతుంది. ముందు ఆ సినిమా పూర్తి చేయాలి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అమెరికాలో `స‌ర్కారు వారి పాట‌` మొద‌లెట్టాలి. రెండు సినిమాల్ని ఒకేసారి చేయ‌డం అసాధ్యం. అందుకే.. స‌ర్కారువారి పాట నుంచి ఆయన త‌ప్పుకున్నారు. ఆ స్థానంలో మ‌ది అమెరికా ఫ్లైట్ ఎక్కారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close