పంజాబ్ ని ఇంటికి పంపించిన చెన్నై

ఈ ఐపీఎల్ లో చెన్నై ఆట తీరు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా సాగ‌లేదు. వ‌రుస ఓట‌ముల‌తో… అభిమానుల్ని నిరాశ ప‌రిచింది. అయితే.. చివ‌రి మ్యాచ్‌ల‌లో మాత్రం గెలిచి ఊర‌డింపు విజ‌యాల్ని అందుకుంది. అంతేకాదు. మిగిలిన జ‌ట్ల ప్లే ఆఫ్ అవ‌కాశాల‌కు గండి కొడుతూ వ‌చ్చింది. ఇప్పుడు పంజాబ్ కి ఇంటికి పంపింది. ఈరోజు పంజాబ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్ల తేడాతో ఘ‌న విజయం సాధించింది. ఈ ఓట‌మితో.. పంజాబ్ ప్లై ఆఫ్ దారులు పూర్తిగా మూసుకుపోయాయి.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..భీక‌ర‌మైన బ్యాట్స్మెన్స్ జ‌ట్టుగా పేరొందిన పంజాబ్‌ని బాగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. 20 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అనంత‌రం బ్యాటింగ్ కి దిగిన చెన్నై ఆడుతూ పాడుతూ విజ‌య ల‌క్ష్యాన్ని అందుకుంది. గైడ్వాడ్ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. 49 బంతుల్లో 66 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు.డూప్లెసీస్ కూడా (48) రాణించ‌డంతో చెన్నై గెలుపు న‌ల్లేరు పై న‌డ‌క‌లా మారింది. ఈ ఓట‌మితో.. పంజాబ్ ప్లే ఆఫ్‌కి దూర‌మైంది. ఇప్ప‌టికే ముంబై ప్లే ఆఫ్ కి చేరుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ఢిల్లీ, రాజ‌స్థాన్, కొల‌కొత్తా జ‌ట్ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close