చంద్రబాబుకు డాక్టరేట్ ఇచ్చేది థర్డ్‌ గ్రేడ్ అమెరికా యూనివర్సిటీ!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అరుదైన గౌరవం దక్కిందని, ప్రతిష్ఠాత్మక షికాగో యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిందని, ఆ యూనివర్సిటీ ఒక విదేశీ నేతకు డాక్టరేట్ ప్రదానం చేయటం ఇదే మొదటిసారని నిన్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సామాజిక-ఆర్థిక సంస్కరణలతో రైతులు, మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని, హుద్‍‌హుద్ తుపానును సమర్థంగా ఎదుర్కొన్నారని, 2029 నాటికి ఏపీని దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా నిలబెట్టటానికి ఒక ప్రణాళికతో ముందుకెళుతున్నారని ఈ కృషికి గుర్తింపుగానే గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని షికాగో వర్సిటీ ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. గతంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు తనకు డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించానని, అయితే షికాగా విశ్వవిద్యాలయం చరిత్ర చూసి అంగీకరించానని చెప్పారు. ఈ వర్సిటీ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని, ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. వారి డాక్టరేట్ స్వీకరించటంవల్ల మన కొత్త రాష్ట్రానికి గుర్తింపు వస్తుందని, ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. తనకు వీలున్న తేదీల్లో దానిని ప్రదానం చేయటానికి అంగీకరించారని, తాను వచ్చినపుడే కాన్వొకేషన్ నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెప్పినట్లు తెలిపారు.

అయితే ఈ డాక్టరేట్ వెనక కొత్త ట్విస్ట్ బయటపడింది. షికాగో యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో ఒకటైన ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’ కాదని, ఇది  ఇల్లినాయిస్ రాష్ట్రప్రభుత్వం నడిపే ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’ అని పరిశీలనలో తేలింది. ఈ యూనివర్సిటీలో చదివేవారిలో 75% మంది ఆఫ్రికన్ అమెరికన్స్, 7% స్వానిష్ వారు, 3% శ్వేతజాతీయులు ఉంటారు. ఈ యూనివర్సిటీ వివిధ ర్యాంకింగ్స్‌లో ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’కు ఎన్నోరెట్లు దిగువన ఉంటుంది. షికాగో స్టేట్ యూనివర్సిటీలో తెలుగువారైన దేవిశ్రీ వి.పొట్లూరి కీలక బాధ్యతలు పోషిస్తున్నారని, ఆయనే చంద్రబాబుకు ఈ డాక్టరేట్ వచ్చేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. చంద్రబాబు బృందం కూడా ఈ యూనివర్సిటీని యూనివర్సిటీ ఆఫ్ షికాగోగా పొరపాటుపడి ఈ థర్డ్ గ్రేడ్ యూనివర్సటీ డాక్టరేట్ తీసుకోవటానికి ఒప్పుకుని ఉండొచ్చన్న వాదన వినబడుతోంది. అమెరికా యూనివర్సిటీ అనగానే గొప్పవని అనుకోవటం సహజం. అయితే అమెరికాలో కూడా బోగస్ యూనివర్సిటీలు కూడా ఉంటాయని, ట్రైవ్యాలీ, యూనివర్సటీ ఆఫ్ నార్త్ వర్జీనియా వంటి విశ్వవిద్యాలయాల బాగోతం బయటపడిందని, నాలుగేళ్ళక్రితం ట్రైవ్యాలీ బోగస్ యూనివర్సిటీ చేసిన మోసంలో తెలుగువారు కూడా బాధితులుగా ఉండటం, వారికి అక్కడ కొనసాగే అవకాశం లేకపోవటంతో పోలీసులు వారికి రేడియో కాలర్‌లు వేయటం గురించి మర్చిపోయినట్లున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close