ప్రతిపక్షాలు ఆ పాయింటు ఎలా మిస్ అయ్యాయి చెప్మా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా లీడ్ ఇచ్చినా దానిని రాష్ట్రంలో ప్రతిపక్షాలు క్యాచ్ చేయలేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. “రెవెన్యూ, మునిసిపల్ శాఖలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్” మారిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పుకొన్నారు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా తన ప్రభుత్వ శాఖలలో అవినీతి జరుగుతోందని ప్రకటించినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అది ప్రతిపక్షాలకు దివ్యాస్త్రంగా ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోవడంతో అధికార పార్టీ గండం గట్టెక్కింది.

ఈ అంశం గురించి వైకాపా తన మీడియాలో ప్రస్తావించినప్పటికీ, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణ మూర్తికి మధ్య వివాదం తలెత్తిందనే విషయాన్ని హైలైట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అపార రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రి బయటపెట్టుకొన్న ఈ అవినీతి గురించి నిలదీయకుండా, కుక్కలు, పందికొక్కుల బారినపడి పిల్లలు చనిపోవడం గురించి మాట్లాడి మునిసిపల్ శాఖ మంత్రి అసమర్దతని ప్రశ్నించడానికే పరిమితమయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగి తేలుతోందని ముక్తాయించారు.కాంగ్రెస్ పార్టీలో ఎవరూ కూడా రెవెన్యూ, మునిసిపల్ శాఖలలో జరుగుతున్న ఈ అవినీతి గురించి ముఖ్యమంత్రిని నిలదీయలేదు.

అయితే ఆ రెండు శాఖలలో మాత్రమే అవినీతి జరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని శాఖలలోను అవినీతి రాజ్యం ఏలుతోంది. ముఖ్యంగా ఎక్సైజ్, రవాణా, వైద్య, విద్యుత్ వంటి శాఖలలో జరుగుతున్నా అవినీతికి సామాన్యులు మూల్యం చెల్లించుకొంటూనే ఉన్నారు. కానీ సదరు మంత్రులెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వైద్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అప్పుడప్పుడు ప్రభుత్వాసుపత్రులను తనికీలు చేస్తున్నప్పుడు బయటపడుతున్న అవినీతే అందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close