H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల ఫీజు భారం మోపిన తర్వాత .. వెంటనే చైనా K వీసా ను ప్రకటించింది. అమెరికా అంటే సహజమైన ఆకర్షణ ఉంది. చైనా అంటే లేదు. కానీ అభివృద్ధిలో.. లైఫ్ స్టైల్లో చైనా కూడా అమెరికా స్టాండర్డ్స్ ను అందుకుంటోంది. అన్నింటి కంటే ముఖ్యం చైనా అమెరికా కంటే ఎక్కువగా ప్రపంచంలో సూపర్ పవర్ ఎదగడానికి ఆర్గానిక్ ప్రయత్నాలు చేస్తోంది. వారికి మరే ఇతర లక్ష్యాలు ఉండవు. వారి టార్గెట్ అంతా .. ఒక దిశగానే ఉంటుంది.
స్టెమ్ రంగాలపై ఆధిపత్యానికి చైనా ప్రయత్నం
ట్రంప్ పరిపాలన వల్ల స్టెమ్ ఇండస్ట్రీస్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో నిపుణులను చైనా కోల్పోనుంది. ఇలా చైనా కోల్పోయే టాలెంట్ ను ఆకర్షించి.. చైనాను టెక్ జెయింట్ గా నిలపాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కొత్త వీసాను ప్రకటించారు. చైనాకు వెళ్లడానికి ఎలాంటి ఆంక్షలు ఎవరికీ లేవు. వీసాలు కూడా సులువుగానే ఇస్తారు. ఇప్పటి వరకూ 12 ఆర్డినరీ వీసా కేటగిరీలను చైనా మంజూరు చేస్తోంది. ఇప్పుడు 13వదిగా ‘K వీసా’ చేర్చారు. ఇది చైనా ‘టాలెంట్ పవర్ స్ట్రాటజీ’లో భాగం, 2035 నాటికి టెక్ సూపర్ పవర్‌గా మారాలనే లక్ష్యంలో భాగంగా ఈ వీసా తీసుకు వచ్చారు.
కొత్త ప్రతిభ కోసం చూస్తున్న చైనా
చైనాకు కావాల్సిన యంగ్ ప్రొఫెషనల్స్ .. అక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ వీసా పొందడానికి ప్రముఖ యూనివర్శిటీలో చదువుకున్న డిగ్రి ఉన్నవారు, టీచింగ్, రీసెర్చ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాకు మల్టిపుల్ ఎంట్రీ/ఎగ్జిట్, లాంగర్ వాలిడిటీ పీరియడ్, ఎక్స్టెండెడ్ స్టే ఉంటుంది. వీసా పొందడానికి చైనాలో లోకల్ ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఈ వీసాతో చైనాలో వర్క్, ఎడ్యుకేషన్, కల్చరల్ ఎక్స్చేంజెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అక్టివిటీలు చేసుకునే చాన్స్ ఉంటుంది. ఫీజు చాలా అంటే చాలా తక్కువ.
చైనాకు మానవ వనరుల కొరత
చైనా తీసుకున్న కఠినమైన జనాభా నియంత్రణ చర్యల వల్ల ఇప్పుడు ఆ దేశం ఇబ్బంది పడుతోంది. మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. అందుకే కే వీసా చైనా ఇన్నోవేషన్ హబ్‌లు టెక్ పార్కులు, బయోటెక్, AI స్టార్టప్‌లకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాల ప్రభావం అమెరికాపై చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసిన తర్వాత మెల్లగా తీవ్రతను తగ్గిస్తున్నారు. కానీ చైనాకు ఓ గొప్ప చాన్స్ ట్రంప్ ఇచ్చేశారు.