డ్రాగన్ చైనాకు షాకిచ్చిన భారత్

టిట్ ఫర్ టాట్. డ్రాగన్ చైనాకు కీలెరిగి వాత పెట్టింది మోడీ ప్రభుత్వం. చైనా ఉగ్రవాదిగా ముద్ర వేసిన ప్రపంచ యుగర్ కాంగ్రెస్ నాయకుడు దోల్కిన్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేసింది. దీంతో చైనా పాలకుకు దిమ్మతిరిగింది. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న వ్యక్తికి భారత్ వీసా ఇవ్వడం దారుణమని చైనా ఇప్పుడు నెత్తీ నోరూ బాదుకుంటోంది.

భారత్ లో ముస్లింలున్నట్టే, చైనాలో తుర్కిక్ ముస్లిం మూలాలున్న యుగర్లున్నారు. ముఖ్యంగా జిన్ జియాంగ్ రాష్ట్రంలో దాదాపు కోటి మంది యుగర్లు నివసిస్తున్నారు చైనా కమ్యూనిస్టు పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్లను అణచివేయడానికి చైనా నిరంకుశ పాలకులు చేయాల్సిందంతా చేస్తున్నారు. యుగర్ల తరఫున పోరాడటానికి ఏర్పడిన సంస్థే ప్రపంచ యుగర్ కాంగ్రెస్. దాని నాయకుడు దోల్కిన్ ఇసా జర్మనీలో ఆశ్రయం పొందాడు.

ఈనెలాఖరులో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో టిటెట్ మతగురువు దలైలామాను కలవడానికి కూడా ఇసాకు భారత్ అనుమతినిచ్చింది. అలాగే, ప్రజాస్వామ్యం-చైనా అనే అంశంపై ధర్మశాలలో జరిగే సదస్సులో కూడా అతడు పాల్గొంటాడు. దీనికి కూడా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో చైనా పాలకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాము టెర్రరిస్టుగా ముద్రవేసిన వ్యక్తికి భారత్ వీసా ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారు.

చైనా మాత్రం పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూనే ఉంటుంది. పఠాన్ కోట్ ఉగ్రదాడికి స్కెచ్ వేసిన నరరూప రాక్షసుడు పాకిస్తాన్ లో ఆశ్రయం పొందిన మసూద్ అజర్ పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడానికి భారత్ విధించింది. అతడిపై ఐక్య రాజ్య సమితి ఆంక్షలు ప్రకటించే సమయంలో చైనా అడ్డుకుంది. వీటో చేసింది. భారత్ ప్రయత్నానికి విఘాతం కలిగించింది. తన మిత్ర దేశం పాకిస్తాన్ ఆశ్రయమిచ్చిన టెర్రరిస్టును కాపాడటానికి, పాక్ పరువు నిలపడానికి చైనా ఆరాటపడింది. భారత్ అభ్యంతరాలను పట్టించుకోలేదు.

దీనికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు భారత్ గట్టి కౌంటరిచ్చింది. ఏ పేరు వింటే చైనా పాలకులు ఆగ్రహంతో ఊగిపోతారో, ఏ సంస్థను ఈసడించుకుంటారో ఆ సంస్థ నాయకుడికి భారత్ వీసా మంజూరు చేసింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ధర్మాన్ని పాటించకపోతే ఇలాంటి షాకులు తప్పవని చైనాకు గుర్తు చేసినట్టయింది. తాను ఆడింది ఆటగా భావించే డ్రాగన్ పాలకులకు కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఈ దెబ్బతో అయినా చైనా నిరంకుశ పాలకులకు కనువిప్పు కలుగుతుందేమో చూడాలి. జీహాదీ ఉగ్రవాదం దెబ్బ భారత్ కే కాదు, చైనాకు కూడా అనుభవంలోకి వస్తోంది. యుగర్ యువకులు కొందరు ఉగ్రవాదులుగా మారారని చైనా గుర్తించింది. వాళ్లలో కొందరిని మట్టుబెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, తమ దేశంలో తలదాచుకుంటున్న యుగర్ టెర్రరిస్టులను పాకిస్తాన్ అంతం చేసిందని, చైనా మెప్పుకోసం ఈ పని చేసిందని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి యుగర్ల ద్వారా ముప్పు పొంచి ఉందని చైనా భయం. కాబట్టి ఇకముందైనా భారత్ అభిప్రయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తుందేమో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close