మేయర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్న చింటూ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌‍లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనూరాధ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ తన నేరాన్ని అంగీకరించాడు. చిత్తూరు జిల్లా ఎస్‌పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఇవాళ ఆ కేసు తాజా వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆరునెలల నుంచే కఠారి అనూరాధ, ఆమె భర్త చింటూలను హత్యచేయటానికి చింటూ కుట్ర పన్నినట్లు తెలిపారు. రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. మూడోసారి అతను విజయవంతమయ్యాడని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు 23 మందికి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, 20 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మిగతా ముగ్గురిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ కేసులో 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు, తనను క్రిమినల్‌గా చూపించి తనకు పెళ్ళి కాకుండా చేశారని, అందుకే వారిని హతమార్చానని చింటూ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్టూడియోల‌కు పూర్వ వైభ‌వం

జీవితం ఓ సైకిల్ చ‌క్రం లాంటిది. ఎక్క‌డ మొద‌లెట్టామో తిరిగి అక్క‌డికే వ‌చ్చి ఆగుతాం. సినిమాల ప‌రిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఇది వ‌ర‌కూ సినిమా అంటే స్టూడియో వ్య‌వ‌హార‌మే. తొలి స‌న్నివేశం...

విమానాల వాయిదా : తొందరపడినా ప్రభుత్వం సిద్ధం కాలేకపోయిందా..?

దేశమంతా విమనాశ్రయాలు ఓపెన్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఒక్క రోజు వాయిదా పడ్డాయి. కారణాలేమైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... లాక్ డౌన్ ఎత్తేసి.. సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని.. లాక్‌డౌన్ 1.0 అయిపోయినప్పుడే...

శ్రీవారి అమ్మకం ఆస్తుల లిస్ట్ చాలా పెద్దదే..!?

తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ... అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని...

ప్రజల భాగస్వామ్యంతో.. “మన పాలన – మీ సూచన..!”

అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ...

HOT NEWS

[X] Close
[X] Close