ఖైదీ నెం.150 వసూళ్ల పై ముందు నుంచీ చాలా చాలా అనుమానాలున్నాయి. చిరు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిదే. రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే… చిత్ర వర్గాలు, అభిమానులు చెబుతున్న లెక్కలు, బాక్సాఫీసు వసూళ్లు చూస్తుంటే… ఖైదీ మరీ `అతి`కి పోతోందేమో అనిపిస్తోంది. టాలీవుడ్లో అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన `తెలుగు` చిత్రం మాదే.. అంటూ గొప్పలు పోతున్నారంతా. ఆఖరికి చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్లో అత్యధిక గ్రాసర్ మాదే అంటున్నాడు. `సింగిల్ లాంగ్వేజ్`లో అనేది అండర్ లైన్ చేస్తున్నాడు. అంటే… కేవలం తెలుగులోనే విడుదలై ఇన్ని కోట్లు సాధించిన ఏకైక చిత్రం ఇదేఅన్నమాట. అలాంటప్పుడు బాహుబలి ఎమైపోయినట్టు??
బాహుబలి తెలుగులోనే కాదు, మిగిలిన అన్ని భాషల్లోనూ విడుదలైంది కదా?? అని మెగా అభిమానుల లాజిక్. కేవలం తెలుగులో బాహుబలి ఎంత సాధించింది? దాన్ని ఖైదీ నెం. క్రాస్ చేసిందా? ఇలాంటి లెక్కలు తీసినా.. ఖైదీ కంటే బాహుబలినే ఎంతో ముందున్నాడన్న విషయం అర్థమౌతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో కలసి బాహుబలి రూ.113 కోట్లు సాధించింది. ఖైదీ కేవలం రూ.80 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఓవర్సీస్లో బాహుబలి ఏకంగా రూ.45 కోట్ల పైచిలుకు సాధిస్తే.. ఖైదీ నెం.150 రూ.13 కోట్లకే పరిమితమైంది. ఇవి కేవలం తెలుగు లెక్కలు ఏమాత్రమే. అయినా తెలుగులో అత్యధిక గ్రాసర్ మాదే అని చిరు ఎందుకు చెప్పుకొంటున్నాడో, ఈ ఫాల్స్ ప్రెస్టేజీ ఏంటో అర్థం కావడం లేదు.