సైరా కోసం కాళ్లు ప‌ట్టుకున్నాడు: చిరంజీవి

మేనేజ‌ర్ వ్య‌వ‌స్థ అనేది సినీ ప‌రిశ్ర‌మ‌కు చాలా కీల‌కం. ఓ సినిమా షూటింగు బాగా జ‌ర‌గ‌డానికి, అనుకున్న స‌మ‌యంలో సినిమా విడుద‌ల కావ‌డానికి మేనేజ‌ర్లు చేసే కృషి చాలా ఉంటుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోలకూ మేనేజ‌ర్లు చేసే కృషేంటో బాగా తెలుసు. అందుకే మేనేజ‌ర్ల‌తో అనుబంధం ధృడంగా కొన‌సాగుతుంటుంది. అందుకు సాక్ష్య‌మే టాలీవుడ్ మేనేజ‌ర్స్ సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వం. ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో ఈ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. సినీ తార‌లంతా ఈ వేడుక‌కు విచ్చేశారు. చిరంజీవి, మ‌హేష్‌బాబులు కూడా హాజ‌రై ఈ కార్య‌క్ర‌మానికి కొత్త అందాన్ని తీసుకొచ్చారు. మేనేజర్లు ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో త‌న‌కు బాగా తెలుస‌ని, షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు త‌క్కువ నిద్ర‌పోయేది వాళ్లేన‌ని చెప్పుకొచ్చారు. సైరా షూటింగ్ లొకేష‌న్ అనుమ‌తి తీసుకురావ‌డం మేనేజ‌ర్ వాళ్ల కాళ్ల‌మీద ప‌డి మ‌రీ బ‌తిమాలిన సంగ‌తి గుర్తు చేసుకున్నారు.

”ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూసాను. సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి అది విడుదల అయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునదిరాళ్లు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లు కావున సినిమా సక్సెస్ లో వారి వంతు చాలా ఉంటుంది. సైరా సినిమా షూటింగ్ కోసం లొకేషన్ మా మేనేజర్ వారి కాళ్ళ మీద పడి అనుమతి తీసుకున్నారు, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు” అన్నారు. నిర్మాత దిల్ రాజు ఈ యూనియ‌న్‌కి 32 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రాజ‌శేఖ‌ర్ – జీవిత దంప‌తులు మ‌రో ప‌ది ల‌క్ష‌లు అందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com