ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రెండూ నువ్వా? నేనా అంటూ పోటీ పడబోతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఎదురుకానుంది. విచిత్రం ఏమిటంటే.. రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. ఓ రకంగా ఈ సంక్రాంతి హీరోయిన్ తనే. ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో శ్రుతిహాసన్ మెరిసింది. అయితే… ‘వాల్తేరు వీరయ్య’ ఫంక్షన్‌కి మాత్రం శ్రుతి డుమ్మా కొట్టింది. ఓ ఫంక్షన్‌కి వచ్చి, మరో ఫంక్షన్ కి రాకపోవడం… ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాకపోతే.. శ్రుతికి ఒంట్లో బాగోలేదట. ఒంగోలు ఫంక్షన్ లో పాల్గొనడం వల్ల పూర్తిగా అలసిపోయిందని, జ్వరం కూడా వచ్చిందని, ప్రస్తుతం కోవిడ్ టెస్ట్ చేయించుకొందని… ‘వాల్తేరు వీరయ్య’ వేదికపై చిరంజీవి శ్రుతిహాసన్ తరపున వివరణ ఇచ్చారు. అయితే.. ‘ఒంగోలులో శ్రుతి ఏమి తిన్నదో.. ఎవరు బెదిరించారో తెలీదు.. ఈ ఫంక్షన్ కి రాలేకపోయింది’ అంటూ చిరు సరదాగా వ్యాఖ్యానించారు. అయితే శ్రుతి ఈ చిత్రంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిందని, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లోనూ డాన్సులు చేసిందని, తన పాత్ర కథలో కీలకం కాబోతోందని.. చిరు కాంప్లిమెంట్ అందించారు.