మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” వాయిదా పడింది. ఈ ఏడాది రావాల్సిన ఈ సినిమాని ఏకంగా 2026 సమ్మర్ కి తీసుకెళ్ళారు. అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న సినిమా సంక్రాంతికి వస్తోంది. ఈ గ్యాప్ లో “విశ్వంభర’ ని తీసుకురావాలంటే గ్రాఫిక్స్ కి సమయం సరిపోలేదు. దీంతో సమ్మర్ కి వెళ్ళాల్సివచ్చింది. వాయిదాని ప్రకటిస్తూ చిరు ఓ వీడియో రిలీజ్ చేశారు.
చాలా మందికి ఒక డౌట్ ఉంది, విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుందని. ఈ జాప్యం సముచితమని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి బెస్ట్ క్వాలిటీతో అందివ్వాలని దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధ శక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది.
ఇది ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకు సైతం అలరిస్తుంది. రిలీజ్ డేట్ ఎప్పుడో నేను లీక్ చేస్తున్నాను. చిన్నపిల్లలు,పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ సీజన్. 2026 వేసవిలో ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’ అని వెల్లడించారు మెగాస్టార్.