చిరంజీవి త్వరలో విశాఖపట్నంలో ఇల్లు కట్టుకోబోతున్నారు. ఈ విషయాన్ని `వాల్తేరు వీరయ్య` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విశాఖ వాసుల మధ్య ప్రకటించారు చిరు. భీమిలి బీచ్ సమీపంలో చిరంజీవి ఓ స్థలం కొన్నారు. అక్కడ త్వరలో ఇల్లు కట్టుకొంటారని చెప్పారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడి మనుషులు పాజిటవ్‌గా ఉంటారని, రిటైర్మెంట్ తరవాత.. విశాఖలో స్థిరపడితే బాగుంటుందని తన మిత్రులు, శ్రేయోభిలాషులు తనకు చెబుతుంటారని, త్వరలోనే తాను కూడా విశాఖ వాసిని కాబోతున్నానని చెప్పుకొచ్చారు చిరు.
చిరుకి విశాఖలో ఓ స్టూడియో కట్టుకోవాలన్న ఆలోచన ఉండేది. స్థలం కోసం అప్పట్లో ప్రయత్నించారు కూడా. జగన్ గవర్నమెంట్. చిరుకి విశాఖలో స్టూడియో కోసం స్థలం కేటాయించబోతోందని చెప్పుకొన్నారు. గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిరు భారీగా.. స్థల సేకరణ చేశారని, ప్రైవేటు ప్రాపర్టీ కొన్నారని, అక్కడ స్టూడియో ఒకటి ఏర్పాటు చేస్తారని అన్నారు. కానీ… ఆ విషయాలేం పెద్దగా పురోగతి సాధించినట్టు కనిపించలేదు. అయితే విశాఖలో ఓ ఇల్లు కట్టుకోవాలన్న చిరు చిరకాల వాంఛ ఇప్పుడు నెరవేరబోతోంది.