చరణ్‌లో బ్యాడ్ క్వాలిటీని బయటపెట్టిన చిరంజీవి

హైదరాబాద్: ఈ ప్రపంచంలో తాను అత్యంతంగా ప్రేమించేది తన భార్య సురేఖనేనని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. చరణ్‌ ఏదైనా అడిగితే తాను కాదని చెప్పగలనని, సురేఖ అడిగితే కాదనలేనని అన్నారు. ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, సురేఖలో బాగా ఇష్టమైనదేమిటని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, తనకు చరణ్‌ను, అద్భుతమైన ఇద్దరు కూతుళ్ళను బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. ఆమె తనకు షాక్ అబ్జార్బర్, స్ట్రెస్ బస్టర్‌గా వ్యవహరిస్తుంటుందని అన్నారు. కెరీర్‌లో అపజయాలగురించి మాట్లాడుతూ, అదృష్టవశాత్తూ ప్రొడ్సూసర్‌లు, డైరెక్టర్‌ల ఇళ్ళచుట్టూ తిరగాల్సిన అవసరం తనకు ఎప్పుడూ రాలేదని, వరసగా సినిమాలలో అవకాశాలు వచ్చాయని చెప్పారు. కెరీర్ మొత్తంలో కొద్దికాలం తప్పితే ఒక్క సంవత్సరంకూడా తనకు హిట్ లేకుండా లేదని, 1995లోమాత్రం వరసగా ఫ్లాప్‌లు రావటంతో ఆరునెలలు మేకప్ వేసుకోకుండా ఖాళీగా ఉన్నానని తెలిపారు. సల్మాన్‌కు తనకు మధ్య స్నేహంగురించి చెబుతూ, అతనొక మంచి మనిషి అని తాను ముంబాయి ఎప్పుడు వెళ్ళినా తనను ఇంటికి తీసుకెళతాడని, మంచి ఆతిథ్యం ఇస్తాడని చెప్పారు. అతనికి తానంటే ఎంతో ఇష్టమని, థమ్స్ అప్ యాడ్ షూటింగ్ సమయంనుంచి తాము సన్నిహితులమయ్యామని తెలిపారు.

చరణ్‌గురించి మాట్లాడుతూ, అతను ఎంతో పరిణతి చెందినవాడని, వయసుకు మించిన ఆలోచనలు అతనిలో ఉన్నాయని అన్నారు. ఒక్కోసారి అతను తనను అప్రమత్తం చేస్తాడని, డాడీ అలా మాట్లాడొద్దు, బాగుండదు అని చెబుతాడని వెల్లడించారు. అతనిలో ఒకే ఒక్క బ్యాడ్ క్వాలిటీ కోపం అని, చాలా త్వరగా కోపం వచ్చేస్తుందని చెప్పారు. దీనిగురించి ఏమైనా అంటే తన తాత గుణమే తనకొచ్చిందని, తానేమీ చేయలేనని చరణ్ అంటాడని చిరు వెల్లడించారు. షూటింగ్‌కు అప్పుడప్పుడూ లేట్‌గా వెళుతూ ఉంటాడని, అలా వెళ్ళొద్దని చెబుతూ ఉంటానని తెలిపారు. వందలమంది నీకోసం వేచిచూస్తూ ఉంటారని హెచ్చరిస్తూ ఉంటానని అన్నారు. తాను షూటింగ్‌కు ఎప్పుడూ లేటుగా వెళ్ళనని, ఒకవేళ లేట్ అయితే తనకు టెన్షన్‌గా ఉంటుందని చిరంజీవి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆంధ్రా నేతలపై వైరల్ అవుతున్న “హరీష్ సాల్వే” వ్యాఖ్యలు..!

భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు....

ప్రతిపక్ష పార్టీ నేతలా పదే పదే రియాక్టవుతున్న వైసీపీ ఎంపీ..!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఘటన జరగినప్పుడు సహజంగా.. విపక్ష పార్టీల నేతలు తక్షణం స్పందిస్తారు. అలాంటి విషయాలపై ఎలా ఎదురుదాడి చేయాలో ఆలోచించుకుని కౌంటర్‌తో ముందుకు వస్తారు అధికార పార్టీ నేతలు. కానీ.....

రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయబోతున్న కేసీఆర్..!?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఆ తీపి కబురు ఏమిటా అని.. అటు టీఆర్ఎస్‌లోనే కాదు... ఇటు విపక్ష పార్టీల్లోనూ.. చర్చ జరుగుతోంది....

అమెరికాలో విస్తరిస్తున్న  “రేసిజం వైరస్..!”

కరోనా దెబ్బకు అమెరికా వణికిపోతూంటే.. తాజాగా... పోలీసుల ఆకృత్యం వల్ల ఆఫ్రికన్ అమెరికన్ మరణించడం.. మరింతగా ఇబ్బంది పెడుతోంది. నల్ల జాతీయుడిని పోలీసుల అకారణంగా చంపడంపై నిరసనలు హింసకు దారి తీసేలా జరుగుతున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close