డీఎస్‌పీపై… చిరు గుర్రు

చిరంజీవి కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌. చిరంజీవి, ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ… ఇలా మెగా హీరోలంద‌రి సినిమాల‌కూ ప‌నిచేశాడు. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మ్యూజిక్ అందించాడు. చిరు న‌టించిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌, శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రాల‌కు సంగీతం అందించింది దేవీనే. చిన్న‌ప్ప‌టి నుంచీ దేవిని ద‌గ్గ‌రుండి చూస్తున్న చిరు… ఎప్ప‌టిక‌ప్పుడు ఎంక‌రేజ్ చేస్తూ వ‌చ్చాడు. దేవిశ్రీ సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో.. ఓ వాచ్ కూడా బ‌హూక‌రించాడు. ఇక నుంచి నీ టైమ్ బాగుంటుంది’ అంటూ దీవించాడు. అలాంటి చిరు ద‌గ్గ‌రే.. దేవి త‌న బిల్డ‌ప్పు చూపించ‌డం మొద‌లెట్టాడిప్పుడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి 150వ సినిమాకి దేవిశ్రీ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకొన్నారు. చిరు సినిమా అన‌గానే ఎగిరి గంతేయాల్సింది పోయి.. క‌మిట్మెంట్స్ ఉన్నాయి.. తీరిక లేదు… హీరోగా ఓ సినిమా చేయాలి, అంటూ కార‌ణాలు వెదుకుతున్నాడ‌ట‌. నో అని నేరుగా చెప్ప‌క‌పోయినా, ప‌నిచేయ‌డం ఇష్టం లేద‌న్న‌ట్టు ప్రవ‌ర్తిస్తున్నాడ‌ని టాక్‌. వినాయ‌క్‌తో ప‌నిచేయ‌డానికి దేవి ఎందుకో ఇబ్బంది ప‌డుతున్నాడ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకే ఈ ప్రాజెక్టుపై ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌. ఈ సంగ‌తి తెలిసి..చిరు దేవిని మంద‌లించిన‌ట్టు తెలుస్తోంది. ”చేస్తే చేయ్‌.. లేదంటే లేదు..” అంటూ దేవిని నిల‌దీసే స‌రికి… డీఎస్‌పీ మారు మాట్లాడ‌కుండా త‌ల దించుకొన్నాడ‌ట‌. మ‌రి.. దేవి నిర్ణ‌యం ఏమిట‌న్న‌ది స‌స్పెన్స్‌గా మారిందిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com