చిరు ది గ్రేట్‌: నిత్య కృషీవ‌లుడికి ప‌ద్మ విభూష‌ణ్‌

మెగాస్టార్ః చిరంజీవి కీర్తి కిరీటంలో మ‌రో క‌లికితురాయి చేరింది. దేశంలోని రెండో అత్యున్న‌త పుర‌స్కార‌మైన ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని కేంద్రం ప్ర‌క‌టించింది. గతంలో చిరు ప‌ద్మ భూష‌ణ్ అందుకొన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న‌కు ప‌ద్మ విభూష‌ణ్ అందింది. స్వ‌యం కృషితో అంచెలంచెలుగా మెగాస్టార్ స్థాయికి ఎదిగిన ప్ర‌యాణం చిరుది. చిత్ర‌సీమ‌లో ఎలాంటి అండ‌దండ‌లు లేకుండా, త‌న క‌ష్టంతో, ఒక్కో మెట్టూ ఎదుగుతూ, త‌న‌కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవ‌డ‌మే కాకుండా, చిత్ర‌సీమ‌కు త‌న ఇంటి నుంచి ఎంతోమంది హీరోల్ని పంపించారు. కేవ‌లం వినోదమే కాదు, సామాజిక సేవ‌లోనూ `నేనున్నా` అంటూ ఆప‌న్న‌హ‌స్తం అందించారు చిరు. బ్లాడ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్ స్థాపించి ఎన్నో ఏళ్లుగా నిర్విరామ‌మైన సేవ‌ల్ని అందిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. సీసీసీ స్థాపించి, విరాళాలు సేక‌రించి, చిత్ర‌సీమ‌లోని కార్మికుల్ని ఆదుకొన్న తీరు… మ‌ర్చిపోలేనిది. ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు కొర‌త‌గా ఉన్న స‌మ‌యంలో.. చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా వేల‌మందికి ఆక్సిజ‌న్ సిలండ‌ర్ల సౌక‌ర్యాన్ని అందించారు. ఎన్నో ప్రాణాల్ని కాపాడారు. 150 సినిమాల్లో న‌టించి, టాలీవుడ్ స్థాయిని పెంచి, తెలుగు సినిమా వైభ‌వానికి, తానూ ఓ కార‌ణంగా నిలిచిన… మెగాస్టార్ పద్మ విభూష‌ణ్‌కి అన్ని విధాలా అర్హుడు. అందుకే తెలుగు 360 మెగాస్టార్ చిరంజీవికి మ‌న‌స్ఫూర్తిగా శుభాకాంక్ష‌లు అందిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close