మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్ వేసుకుంటున్నారు. చిరు క‌థానాయ‌కుడిగా `భోళా శంక‌ర్‌` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. శుక్ర‌వారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. 12 రోజుల పాటు టాకీ ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ షెడ్యూల్ లో చిరుతో పాటుగా, కీర్తి సురేష్, ఇత‌ర న‌టీన‌టులు పాల్గొన‌బోతున్నారు. శుక్ర‌వారం కాఫీ షాప్ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తారు. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం వేదాళంకి ఇది రీమేక్‌. చిరు చెల్లాయిగా కీర్తి న‌టిస్తోంది. త‌మ‌న్నా క‌థానాయిక‌. ఈ షెడ్యూల్ పూర్త‌య్యాక‌… `గాడ్ ఫాద‌ర్‌` షూటింగ్ మొద‌లెట్ట‌బోతున్నారు చిరు. ఫిబ్ర‌వ‌రిలో `గాడ్ ఫాద‌ర్‌` కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్యాడర్ పార్టీ టీడీపీ మరో సారి ఫ్రూవ్ !

దారుణ పరాజయం.. ఆ తర్వాత వేధింపులు.. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టుడు.. చివరికి స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని నిస్సహాయత... ఇలాంటి పరిస్థితుల్లో నేతలంతా జావకారిపోయారు. కానీ.. క్యాడర్ మాత్రం అంతే ఉంది....

ఇప్పుడు ఎన్టీఆర్ అందరి వాడు !

నిన్నామొన్నటిదాకా ఎన్టీఆర్ అంటే టీడీపీ సొత్తు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్టీఆర్ అంటే అందరి వాడు. ఏపీలో వైసీపీ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజును నిర్వహించింది. విజయవాడతో పాటు పలు...

ఖర్చు లేకుండా పార్టీ నడుపుతున్న వైసీపీ !

రాజకీయ పార్టీ నడపడం అంటే మాటలా ? రూ. కోట్లకు కోట్లు కావాలంటారు. అయితే వైసీపీ మాత్రం అసలు ఖర్చే లేకుండా పార్టీని నడుపుతోంది. ఈ విషయాన్ని వైసీపీనే చెబుతోంది....

ఆత్మకూరు బరిలో ఆనం కుమర్తె !

ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఆసక్తికరంగా పరిణామాలు మారుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లోకేష్‌తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close