దేవాక‌ట్టా క‌థ‌కు చిరు గ్రీన్ సిగ్న‌ల్‌

ప్ర‌స్థానంలాంటి చిత్రంతో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా. అయితే ఆ త‌ర‌వాత ఆ ఊపు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేసిన ఫ‌లితం లేకుండా పోయింది. ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దేవాక‌ట్టా – సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబో అంటే కాస్త విచిత్రంగానే క‌నిపిస్తోంది. ఈ కాంబో సెట్ట‌వుతుందా, లేదంటే వార్త‌ల‌కే ప‌రిమితం అవుతుందా? అనిపించింది. కానీ.. ఈ క‌థ ఇప్పుడు ఓకే అయిపోయింది.

సాయిధ‌ర‌మ్ చేయ‌బోయే క‌థ‌ల్ని చిరంజీవి విన‌డం, ఆయ‌న ఓకే అంటేనే ప‌ట్టాలెక్క‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. దేవాక‌ట్టా చిరంజీవిని కలిసి ఈ క‌థ వినిపించ‌డం, ఆయ‌న ఓకే అన‌డం జ‌రిగిపోయాయి. చిరు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిందంటే – బొమ్మ ప‌డిపోవ‌డం ఖాయం. సో.. దేవాక‌ట్టా ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డ‌మే త‌రువాయి. ఫిబ్ర‌వ‌రిలోగానీ, మార్చిలోగానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. భ‌గ‌వాన్‌, పుల్లారావులు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com