ఈ దీపావళికి తెలుగులో సినిమాలేం విడుదల కావడం లేదు. అయితే లుక్కుల మీద లుక్కులు ఇవ్వడానికి టాలీవుడ్ సమాయాత్తం అవుతోంది. గౌతమి పుత్ర శాతకర్ణిలోని బాలకృష్ణ సరికొత్త లుక్‌ని దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మహేష్ బాబు – మురుగదాస్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ డిజిటల్ పోస్టర్ దీపావళికి చూపిస్తారని తెలుస్తోంది. గోపీచంద్ – బి.గోపాల్ సినిమాకి సంబంధించిన లుక్ కూడా దీపావళి రోజునే బయటకు రానుంది. ఇప్పుడు చిరంజీవి కూడా దీపావళి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.
చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది వరకే ఫస్ట్ లుక్ పేరుతో కొన్ని ఫొటోల్ని విడుదల చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఫస్ట్ లుక్‌ని ఈ దీపావళికి చూపించనున్నారు. 29వతేదీ శనివారం సాయిత్రం ఈ లుక్‌ని రివీల్ చేయనున్నారు. టీజర్‌లాంటిది ఒకటి వదలాలని చిత్రబృందం భావించినా.. అందుకు ఇంకాస్త సమయం తీసుకోవాలని వినాయక్ నిర్ణయించుకొన్నాడట. ఈసారికి లుక్ ఒకటి వదిలితే సరిపోతుందని.. చిరుకి సంబంధించిన స్టిల్ వదలడానికి రెడీ అయ్యారు. సో… చిరు ఫ్యాన్స్‌కి ఓ రోజు ముందుగానే దీపావళి వచ్చేస్తుందన్నమాట.