చిరు మాస్ లుక్ … అరాచ‌కం ఆరంభం

చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఆచార్య ప‌నులు ముగించి `గాడ్ ఫాద‌ర్‌`ని ప‌ట్టాలెక్కించాడు. మ‌రోవైపు భోళా శంక‌ర్ ఉండ‌నే ఉంది. ఇప్పుడు బాబితో సినిమానీ ప‌రుగులు పెట్టించే ప‌నిలో ఉన్నాడు. బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. `పూన‌కాలు లోడింగ్‌` అంటూ.. చిరు పుట్టిన రోజున ప్రీ లుక్ వ‌దిలారు. ఇప్పుడు పూర్తి లుక్ బ‌య‌ట పెట్టారు. క‌ళ్ల‌కు చ‌లువ అద్దాలు, నోట్లో బీడీ, చేతిలో లైట‌ర్ తో.. మాసీ మాసీగా క‌నిపించాడు మెగాస్టార్‌. నిజంగా ఫ్యాన్స్‌కి ఇది పూన‌కాలు తెప్పించే మూమెంటే. “బాబీ చిరంజీవికి వీరాభిమాని.. ఓ ఫ్యాన్ త‌న హీరోని ఎలా చూడాల‌నుకుంటాడో, అలా చిరంజీవిని ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు“ అని మైత్రీ మూవీస్ చెబుతోంది. చిరు న‌టించే 154వ సినిమా ఇది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. `వాల్తేరు శీను` అనేది వ‌ర్కింగ్ టైటిల్. ఇదే ఫిక్స్ కావొచ్చు కూడా. ఈ సినిమా టైటిల్ ని కూడా ఇదే రోజు ప్ర‌క‌టిస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ.. టైటిల్ విష‌యంలో ఇంకొంచెం టైమ్ తీసుకోవాల‌నుకుంటున్నాడు బాబి. మ‌రో మంచి ముహూర్తం చూసి, టైటిల్ ని వ‌దిలే అవ‌కాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close