ఈనెల 22 చిరంజీవి పుట్టిన రోజు. తొమ్మిదేళ్ల తరవాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తున్న చిరు పుట్టిన రోజు ప్రత్యేకంగా జరపాలని మెగా ఫ్యాన్స్పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకొంటున్నారు. రక్తదాన శిబిరాల్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించుకొన్నారు. దానికి తోడు చిరు 150వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆ రోజు రాబోతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర్రాల్లోని చిరు అభిమానులు.. ఆయన్ని కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేద్దామనుకొన్నారు. అందుకోసం భారీ ప్లానులు కూడా వేసుకొన్నారు. అయితే ఫ్యాన్స్‌కి చిరు హ్యాండివ్వబోతున్నాడని టాక్. తన పుట్టిన రోజున చిరు ఎవ్వరికీ అందుబాటులో ఉండడం లేదు. కుటుంబంతో కలసి… విహారయాత్రకు వెళ్లబోతున్నట్టు టాక్. హైదరాబాద్‌కు మళ్లీ 24న తిరిగొస్తారని టాక్. ఇది కచ్చితంగా ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టే విషయమే.
చిరుని నేరుగా కలుసుకొని విషెష్ చెబుదామని ఆశ పడ్డ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఉసూరుమంటున్నారు. చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్ 22న ఉదయం డైరెక్టుగా ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు మోషన్ పోస్టర్నీ విడుదల చేసే అవకాశాలున్నాయి. చిరుని వెల్కమ్ చేస్తూ… మెగా హీరోలంతా స్పెషల్ బైట్లు ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ వరుణ్ తేజ్ ఓ ఫేస్బుక్లోఓ వీడియోని పోస్ట్ చేశాడు. సాయిధరమ్‌తేజ్, శిరీష్, బన్నీ వీడియోలు త్వరలో రాబోతున్నాయి.