చిరు… పెసరెట్టు ఉప్మా

బి ది రియల్ మేన్ – పేరుతో సోషల్ మీడియాలో ఓ ఛాలెంజ్ నడుస్తోంది. ఇంటి పనులు చేస్తూ… ఆ వీడియోని పోస్ట్ చేసి, మరి కొంతమందికి ఛాలెంజ్ విసరడం దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఎన్టీఆర్ కూడా ఇలాంటి వీడియోని పోస్ట్ చేశాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకష్ణలకు ఈ ఛాలెంజ్ పాస్ చేశాడు. ఆ ఛాలెంజ్ ని స్వీకరించిన చిరు.. దాన్ని ఇప్పుడు పూర్తి చేశారు.

వాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు శుభ్రపరిచిన చిరు.. ఆ తరవాత వంట గదిలో దూరి పెసరెట్టు ఉప్మా వేశారు. ఏదో వీడియో కోసం గరెట తిప్పడం కాకుండా.. నిజంగా పెసరెట్టు ఉప్మా వేయడంలో ఉన్న తన అనుభవాన్నంతా రంగరించి మరీ వంటింట్లో.. చెలరేగిపోయారు. పెసరెట్టు ఉప్మా రెడీ అయ్యాక తన తల్లి అంజనాదేవికి వడ్డించి, దగ్గరుండి తినిపించారు. ఇవి రోజూ ఇంట్లో చేసే పనులే అని, కానీ ఈ సారికి వీడియో సాక్షంగా నిలిచిందని చెబుతూ దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా తన మిత్రుడు రజనీకాంత్ తో పాటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ని ఈ ఛాలెంజ్ కోసం నామినేట్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close