‘ఆచార్య’ ఫ్లాప్ కొర‌టాల‌పై తోసేసిన చిరు

ఆచార్య ఫ్లాప్ అయిన త‌ర‌వాత ఆ సినిమా గురించి పెద్దగా స్పందించ‌లేదు చిరు. ఓ కార్య‌క్ర‌మంలో మాత్రం ద‌ర్శ‌కుల‌పై సెటైర్లు వేశాడు. సెట్లోనే సీన్లు రాస్తున్నార‌ని, దాని వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ప‌రోక్షంగా కొర‌టాల శివ‌పై బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇప్పుడు మాత్రం డైరెక్ట‌ర్‌గానే ఆచార్య ఫ్లాప్‌ని కొర‌టాల‌పై తోసేశాడు. గాడ్ ఫాద‌ర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా బాలీవుడ్ మీడియాకు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు చిరు. ఈ సంద‌ర్భంగా ఆచార్య ఫ్లాప్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. `ఆ సినిమా ఫ్లాప్ విష‌యంలో బాధ ప‌డ‌డం లేదు. నేను ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టే చేశా` అంటూ ఈ ఫ్లాప్‌కి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. కొర‌టాల‌నే అన్న‌ట్టు మాట్లాడాడు చిరు.

”ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో హిట్‌, ఫ్లాప్‌కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడ్ని. ఫ్లాప్ వ‌స్తే బాధ ప‌డ‌డం, హిట్ కొడితే ఆనందించ‌డం చాలా కామ‌న్ గా ఉండేది. కానీ… ఆ త‌ర‌వాత ఆ రెండింటికీ ప్రాధాన్యం త‌గ్గిపోయింది. అందుకే ఆచార్య ఫ్లాప్ విష‌యంలోనూ బాధ లేదు. కాక‌పోతే… నేనూ,చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టించిన సినిమా అది. భ‌విష్య‌త్తులో మ‌రోసారి మేమిద్ద‌రం క‌లిసి న‌టించాల‌నుకొంటే ఇంత జోష్ ఉండ‌క‌పోవొచ్చు” అంటూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. చిరు గాడ్ ఫాద‌ర్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌రు 5న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close