కొండ‌పొలం తొలి రివ్యూ.. చిరు నుంచి

మ‌రికొద్ది గంట‌ల్లో కొండ‌పొలం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడు. ఓ న‌వ‌ల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌రిచాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి తొలి రివ్యూ వ‌చ్చేసింది. అదీ చిరంజీవి నుంచి.

కొండ‌పొలం చిత్రాన్ని చిరంజీవి కోసం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమా చూసిన వెంట‌నే చిరు త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. “ఇప్పుడే కొండ‌పొలం చూశాను. గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని అందంగా ప్ర‌తిబింబిస్తూ, చ‌క్క‌టి సందేశం ఇచ్చారు.క్రిష్ ప్ర‌తీసారీ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం, న‌టీన‌టుల నుంచి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్టుకోవ‌డం చూస్తుంటే ఆనందం క‌లుగుతోంది. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని, అవార్డుల్ని, రివార్డుల‌నీ అందుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంద“ని చిరు ట్వీట్ చేశారు. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే చిరు నుంచి ఈ ర‌క‌మైన ట్వీట్ రావ‌డం చిత్ర‌బృందానికి బూస్ట్ లాంటిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close