హైదరాబాద్: దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలనుందని చిరంజీవి చెప్పారు. తన 151వ సినిమాగానీ, 152వ సినిమాగానీ రాజమౌళితో అయితే బాగుంటుందని అన్నారు. ఒక ఆంగ్లదినపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి అనేక విషయాలపై స్పందించారు. తనకు బహుమతులిస్తుంటే ఇవేమీ వద్దు, ఒక మనవడినిగానీ, మనవరాలినిగానీ ఇవ్వమని కోడలు ఉపాసనను కోరానని చెప్పారు. మనవరాళ్ళ విశేషాలు చెబుతూ మురిసిపోయారు.వాళ్ళు బాగా అల్లరి చేస్తారని, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడుపుతానని చెప్పారు. తాను ఒక హీరోనంటే వాళ్ళు నమ్మటంలేదని, వాళ్ళ దృష్టిలో చరణ్ మాత్రమే హీరో అని అన్నారు. తన భార్య తన పాత చిత్రాల వీడియోలు చూపిస్తే అప్పుడు నమ్మారని చెప్పారు. ప్రతిరోజూ లంచ్‌కు ఇంట్లోని అందరూ కలుస్తామని తెలిపారు. ప్రతి సంక్రాంతికీ మొత్తం కుటుంబమంతా ఎక్కడో ఒకచోటికి స్పెషల్ ట్రిప్‌కు వెళతామని చెప్పారు. ఒక్కోసారి బెంగళూరు ఫార్మ్‌హౌస్‌కు, ఒక్కోసారి ఢిల్లీకి వెళతామని తెలిపారు. చిన్నా, పెద్దా కలిసి మొత్తం 60-70మందిమి వెళతామని, మంచి ఫుడ్, గేమ్స్‌తో ఎంజాయ్ చేస్తామని చెప్పారు. టాలీవుడ్‌లో 3 ఏఎమ్ ఫ్రెండ్స్ ఎవరని అడగగా, నాగార్జున, మోహన్ బాబు, వెంకటేష్, శ్రీకాంత్, రవితేజ… అందరూ మంచి మిత్రులేనని చిరంజీవి తెలిపారు.