కేస్ స్టడీ అంటే ఏమిటి చిరు ?

చిరంజీవి అభినందనలు బావుంటాయి. మనసుని హత్తుకునేలా అభినందలు చెబుతారాయన. ఆయన పొగడ్తలు కూడా అందంగా వుంటాయి. అయితే తాజాగా జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ మీట్ లో చిరు పొగడ్తలో కాస్త అతి ధ్వనించింది. ”దర్శకుడు బాబీ సినిమా అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదొక అందమైన స్క్రీన్ ప్లే. వాల్తేరు వీరయ్య సినిమాని అందరూ ఒక కేస్ స్టడీలా తీసుకువాలి.” అన్నారు చిరు. ఈ మాటలు కాస్త షాకింగ్ గా, ఇంకాస్త విచిత్రంగా, మరి కాస్త అతిగా తోచాయి.

వాల్తేరు వీరయ్య సినిమా ఎలా వుందో చూసిన వారికి ఒక ఐడియా వుంది. ఈ సినిమాకి ముచ్చటగా మూడు మంచి రివ్యూలు రాలేదు. ఏ ఒక్కరూ కూడా మూడు స్టార్లు ఇచ్చిన దాఖలాలు లేవు. రివ్యూల మాట పక్కన పెట్టండి. కొందరు మెగా అభిమానులకే సినిమా నచ్చలేదు. కథలో బలం లేదు. చిరు డ్యాన్సులో గ్రేస్ కనిపించలేదు. పాటలు కుదరలేదు. ఎమోషన్స్ పండలేదు. ఐతే రివ్యూలతో, ప్రేక్షకుల స్పందనతో నిర్మాతలకు సినిమా యూనిట్ పని లేదు. శ్రీను వైట్ల ఎదో సినిమాలో చెప్పినట్లు పచ్చడైపోయిన సినిమా కూడా ప్రెస్ మీట్లో పోగడొచ్చు. ఇది హీరో, నిర్మాతల జన్మ హక్కు.

అయితే పొగిడే విధానంలో ఒక పద్దతి వుంటుంది. వాల్తేరు వీరయ్యని ఒక కేస్ స్టడీ అన్నారు చిరు. ఇదొక కమర్షియల్ సినిమా. చిరంజీవి చేసిన కమర్శియల్ సినిమాల్లో కేస్ స్టడీగా తీసుకునే సినిమాలు చాలా వున్నాయి. ఒక ఫ్యామిలీ స్టొరీలో మాస్ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలో గ్యాంగ్ లీడర్ ని చూసి స్టడీ చేయొచ్చు. ఒక రీమేక్ సినిమాని ఎలా చేయాలో ఠాగూర్ చూసి నేర్చుకోవచ్చు. ఇలా ఆయన చేసిన చాలా సినిమాలు వున్నాయి. అంతేకానీ వాల్తేరు వీరయ్య లాంటి వీక్ ప్రోడక్ట్ ని కేస్ స్టడీగా తీసుకోమని చెప్పడంలో చిరు నమ్మకం ఏమిటో అర్ధం కాదు. బహుసా మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం గొప్పగా ప్రకటించుకుంటున్న కలెక్షన్స్ నెంబర్లు (వాస్తవ లెక్కలు నిర్మాతల అంతరాత్మకే తెలుసు) ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close