రావ‌య్యా చిరంజీవి.. రావ‌య్యా..

టాలీవుడ్‌కి ఇప్పుడు చిరంజీవి `అతిథి` పాత్ర పోషిస్తున్నాడు. మెగా హీరోల సినిమా ఫంక్ష‌న్ అంటే చిరంజీవినే గుర్తొస్తున్నారు. చ‌ర‌ణ్ ఆడియో ఫంక్ష‌న్ల‌కు చిరు వెళ్లాల్సిందే. బ‌న్నీ పిలిచినా మొహ‌మాట‌మే. సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌నూ కాద‌న‌లేడు. ఇప్పుడు అల్లుడు కూడా వ‌చ్చాడు. క‌ల్యాణ్ `విజేత‌` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ ఆడియో ఫంక్ష‌న్‌కి కూడా చిరంజీవినే ముఖ్య అతిథి. మామ‌య్య‌గా అల్లుడికి చిరు స‌పోర్ట్ ఇవ్వాల్సిందే. నిజానికి పెళ్లి మాట‌ల్లో ఇదే ప్ర‌ధాన‌మైన ష‌ర‌త‌ని.. అప్ప‌ట్లో చెప్పుకున్నారు. వారాహి సంస్థే ఈ చిత్రానికి అఫీషియ‌ల్ నిర్మాత అయినా.. డ‌బ్బులు స‌మాకూరుస్తోంది మాత్రం మెగా ఫ్యామిలీనే అనే టాక్ కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. కేవ‌లం ఫ్యామిలీ హీరోల ఫంక్ష‌న్ల‌కు వెళ్తే బాగోద‌ని – అప్పుడ‌ప్పుడూ మిగిలిన వాళ్ల ఫంక్ష‌న్ల‌లో మెర‌వ‌డం త‌ప్ప‌ని స‌రి. ఒక‌ప్పుడు ఏ ఆడియో ఫంక్ష‌న్ చూసినా దాస‌రి నారాయ‌ణ‌రావు క‌నిపించేవారు. ఇప్పుడు ఆ ప్లేసులో చిరంజీవి క‌నిపించ‌బోతున్నాడు. అంతే తేడా. ఇక నుంచి ఆడియో ఫంక్ష‌న్ల‌లో చిరు ఎంట్రీ చూసీ చూసీ బోర్ కొట్టినా కొట్టొచ్చు. మెగా ఫ్యాన్స్ కి మాత్రం వారానికి ఓసారి చిరంజీవిని క‌ళ్లారా చూసుకునే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.