తెలుగు సినీ పరిశ్రమని ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 300 ఎకరాల్ని స్డూడియోలు నిర్మించడానికి కేటాయించే ఆలోచనల్లో ఉంది. ప్రస్తుతం విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో ఒక్కటే ఉంది. దానికి ఆనుకుని ఉన్న మూడు వందల ఎకరాల్ని సినీ పరిశ్రమకు స్టూడియోల నిమిత్తం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా చిరంజీవి ఓ స్టూడియో నిర్మించే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో చిరుకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన ద్వారానే చిరు స్టూడియో కట్టడానికి కొంత స్థలం ఇవ్వబోతున్నటు సమాచారం. భీమిలి సమీపంలో చవగ్గా భూముల్ని కొనుగోలు చేశార్ట. ఇప్పుడు అక్కడ కూడా రికార్డింగ్ థియేటర్లు, స్టూడియోలు నిర్మించే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం. మూడు దశాబ్దాలుగా చిత్రసీమలో కథానాయకుడిగా కొనసాగుతున్నాడు చిరు. ఆయన కుటుంబంలోనే దాదాపు అరడజనుమంది హీరోలున్నారు. అయినా చిత్రసీమలో ఒక్క స్టూడియో గానీ, రికార్డింగ్ థియేటర్గానీ సంపాదించుకోలేకపోయాడు. ఇప్పుడు ఆలోటు తీర్చడానికి భారీ స్టూడియో నిర్మాణానికి రంగం సిద్ధం చేయబోతున్నట్టు టాక్. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.