గద్దర్ అవార్డ్స్.. చిరు స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది అవార్డులని గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన పై ఇప్పటివరకూ పరిశ్రమ నుంచి అనుకున్న స్పందన రాలేదు. అయితే అందరూ ఎదురుచూస్తున్న మెగాస్టార్ స్పందన ఇప్పుడు వెలువడింది. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది.

పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న వారిని సీఎం, మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్‌ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సముచితమైందని పేర్కొన్నారు చిరు. ‘నంది అవార్డులు గత చరిత్రలా అయిపోయాయి. వాటిని త్వరలో ఇస్తామని సీఎం ప్రకటించడం ఆనందదాయకం. ఆ అవార్డులకు గద్దర్‌ పేరు పెట్టాలనే నిర్ణయం ఎంతో ఆనందకరం’ అని తన స్పందన తెలియజేశారు చిరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close